Today Telangana cm KCRs birth Day

Today telangana cm kcrs birth day

KCR, KCR Birth day, Telangana CM

Today Telangana cm KCR birth day. He completed sixty one years and entered into sixty two year

నేడు కేసీఆర్ పుట్టిన రోజు

Posted: 02/17/2016 08:17 AM IST
Today telangana cm kcrs birth day

తెలంగాణ ఉద్యమ సారధి, బంగారు తెలంగాణ రధసారధి, తెలంగాణ సిఎం కేసీఆర్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఎంతో కాలంగా తెలంగాణ వాదుల్లో ఉన్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కాంక్షకు ఓ రూపాన్నిచ్చి తెలంగాణ ఆవిర్భావానికి పరిస్థితులను నడిపించిన నాయకుడు కేసీఆర్. అతడు మాట్లాడుతుంటే ఎదుటి పక్షాల మీద తూటాల వర్షం కురిసినట్లే.. ఆయన మాట ఎంతో మందికి పిలుపు.. ఎంతో మందికి మేలుకొలుపు. తెలంగాణను ప్రస్తుతం ప్రగతివైపు వేగంగా నడిపిస్తు.. దేశంలో తెలంగాణ ప్రభను తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతో మంది మొండి వాడు అని అంటారు.. అదే మొండితనం తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనేదాకా వచ్చింది. చివరకు తన పంతానే నెగ్గించుకున్నారు. కేసీఆర్ ను అందుకే చాలా మంది బక్కోడే కానీ గట్టోడు అని అంటారు.

కల్వకుంటల చంద్రశేఖర్ రావు ఇది ఒక పేరు కాదు బ్రాండ్. ఆయన ప్రస్థానం ఓటమితో ఆరంభమైంది. 15 ఏళ్ల క్రితం తెలుగు దేశం పార్టీలో మంత్రి పదవి దక్కించుకోలేక పోయారు కేసీఆర్. ఆ కసే ఆయన్ని ఇప్పుడు విజేతగా నిలిపింది. లక్ష్యం పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని చేసి చూపించారు. టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన 15 ఏళ్ల క్రితం తెలంగాణ పదాన్ని నినాదంగా ఎత్తుకున్నారు. ఆ పదమే రాజకీయాలను మలుపు తిప్పుతుందని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు. ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయని ఎవరూ అంచనా వేసి ఉండరు. తర్వాత ఒక్కసారిగా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లి.. చివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారులు వేశారు.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ అసలు సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. అప్పటి వరకు ఉద్యమ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను రాజీకీయ పార్టీగా మార్చడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. కేవలం రాజకీయ పార్టీగా మార్చడమే కాదు. తెలంగాణలో తిరుగులేని పార్టీగా నిలబెట్టారు. ప్రతి ఎన్నికల్లో వార్ వన్ సైడే అనేలా చేస్తున్నారు. ఒకప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించని టీఆర్ఎస్ కు. ఈసారి 99 సీట్లు వచ్చేలా చేశారు. ఇక వరంగల్, నారాయణ్ ఖేడ్ లాంటి ఉప ఎన్నికల్లో అభ్యర్థితో సంబంధం లేకుండా భారీ మెజార్టీలతో గుళాబి జెండాను రెపరెపలాడిస్తున్నారు. ఆయన పాలనకు తెలంగాణ ప్రజల మద్దతూ ఆయనకు ఉంటోంది. ప్రస్తుతం తిరుగులేని నేతగా నీరాజనం అందుకుంటున్న కేసీఆర్ పుట్టిన రోజును పండుగలా చేసుకుంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు.కేసీఆర్ ఇలాంటి పుట్టిన రోజులను మరెన్నో జరుపుకొోవాలని తెలుగువిశేష్ మనసారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  KCR Birth day  Telangana CM  

Other Articles