Gun misfire tension in Hyderabad MLA Quarters

Gun misfire tension in hyderabad mla quarters

Hyderabad, MLA Quarters, Driver Akbar

Narsapur MLA Chilumula Madan Reddy’s driver Akbar died of gun shots as he mishandled a gun at Hyderguda MLA quarters here on Tuesday. There could be some foul play by his employer to eliminate him,” Rashida told media at the accident spot. Akbar in his early 30s was reportedly curious to check the gun which the MLA’s gunman Ravinder kept it on the table. However, Akbar’s aunt, who was informed about the incident by the MLA’s men, alleged that there must be some foul play behind the death. The victim hails from Chowdarypally village in Mahbubnagar district and had been working for the MLA since 15 years in Medak district.

హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాల్పుల కలకలం

Posted: 02/17/2016 08:30 AM IST
Gun misfire tension in hyderabad mla quarters

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. హిమాయత్ నగర్ లో డాక్టర్ల మధ్య ఫైరింగ్ ఘటన మరువక ముందే.. మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. మెదక్ జిల్లా నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గన్ మెన్ ప్రభాకర్ చేతిలో తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే కారు డ్రైవర్ సయ్యద్ అక్బర్ మృతి చెందాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాల్పులు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే డ్రైవర్ సయ్యద్ తుపాకీతో కాల్చుకుని చనిపోయాడనే వాదన వినిపిస్తోంది. పోలీసులు విచారణలో భాగంగా ఎమ్మెల్యే గన్ మెన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హోల్డర్ చెరిగిపోవడంతో సరి చేసుకునే ప్రయత్నంలో అది మిస్ పైర్ అయిందని గన్ మెన్ చెబుతున్నట్టు పోలీసులు వెల్లడించారు.

అయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న కథనాలు వేరుగా ఉన్నాయి. గన్ మెన్ వద్ద ఉండాల్సిన తుపాకీని డ్రైవర్ సయ్యద్ అక్బర్ హ్యాండిల్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి చనిపోయాడని అంటున్నారు. అయితే ప్రేమ విఫలం కావడంతో సయ్యద్ అక్బర్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మృతుడు సయ్యద్ అక్బర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి దగ్గర పదేళ్లుగా కారు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఎంతో నమ్మకస్తుడిగా గుర్తింపు పొందాడు. అటు గన్ మెన్ ప్రభాకర్ కూడా మదన్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆయన దగ్గర పని చేస్తున్నాడు. ఎంతో నమ్మకస్తుడు కూడా. కాగా మృతుడు సయ్యద్ ది మహబూబ్ నగర్ జిల్లా వెల్దండ చౌదర్ పల్లి గ్రామం. సయ్యద్ అక్బర్ కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ల స్టేట్ మెంట్ కూడా తీసుకున్నాక విచారణను మరింత ముమ్మరం చేయనున్నారు. ప్రస్తుతం అయితే దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కాగా మిస్ ఫైర్ వల్లే సయ్యద్ చనిపోయాడని ఎమ్మెల్యే కూడా చెబుతున్నారు. అయితే ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు. దీని పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా లేక ప్రతీకారమా అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  MLA Quarters  Driver Akbar  

Other Articles