ap agrees to give back khammam villages back to telangana

Khamman villages to be part of telangana again says kcr

Telangana, Andhra Pradesh, chandra babu, KCR, Khammam, ap chief minister chandra babu, telangana chief minister k chandra shekar rao, khammam villages, nda first cabinet meet, modi cabinet

Andhra Pradesh chief minister chandra babu agrees to give back khammam villages back to telangana says telangana chief minister chandrashekar rao

పట్టుబట్టి ఏపీలో కలిపిన గ్రామాలు.. మళ్లీ తెలంగాణాలోకే.. బాబు సమ్మతితోనేనట

Posted: 02/16/2016 03:03 PM IST
Khamman villages to be part of telangana again says kcr

రాష్ట్ర విభజన జరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు తెలుగు చంద్రులు అధికార పగ్గాలు కూడా చేపట్టకముందు.. హుటాహుటిన జరిగిన పరిణామాలలో భాగంగా ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాలను ఏపీలో కలిపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఏర్పాటైన కేంద్ర క్యాబినెట్ ఈ అంశానికి అత్యంత ప్రాథాన్యత ఇస్తూ.. ఖమ్మంలోని పలు గ్రామాలను ఏపీలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇ:దుకు సంబందించిన అంశాన్ని కూడా అప్పట్లో మీడియాకు వెలువరించకుండా ఆఘమేఘాలపై తీసుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ పట్టుబట్టి ఈ గ్రామాలను తమ రాష్ట్రంలో కలుపుకున్నారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే అప్పుడు ఎంతో పట్టుబట్టి చేయించిన పనికి అనుకున్నంత ప్రతిఫలం ఇవ్వడం లేదో.. లేక మరే కారణమో తెలియదు కానీ ఇప్పుడు ఆ గ్రామాలను మళ్లీ తెలంగాణలో విలీనం చేయడానికి సిద్దమయ్యారట.  ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ఈ విషయమై తాను ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, ఆ గ్రామాలను వెనక్కు ఇచ్చేందుకు ఆయన సమ్మతించారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, అతి త్వరలో గ్రామాలన్నీ తిరిగి తెలంగాణలో కలుస్తాయని, అక్కడి వారికి కావాల్సిన అన్ని రకాల సాయం చేసేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఖమ్మం జిల్లాను రెండుగా చేసేందుకు కట్టుబడి ఉన్నానని అన్నారు. జిల్లాలో మైనింగ్ యూనివర్శిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నట్టు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Andhra Pradesh  chandra babu  KCR  Khammam  

Other Articles