vallabhaneni vamsi mohan, gannavaram mla, jail, station bail, ramavarapadu, patamata police

Will go to jail no need of bail says mla vamsi mohan

vallabhaneni vamsi mohan, gannavaram mla, jail, station bail, tdp mla, chandra babu, chief minister, konakalla narayana, vijayawada tdp president bachalla arjunudu, krishna district collector, ramavarapadu, patamata police

gannavaram mla vallabhaneni vamshi mohan says he will fo to jail, tells his followers not to try even for station bail.

బెయిల్ వద్దు.. జైలుకే వెళ్తానంటున్న టీడీపీ ఎమ్మెల్యే..

Posted: 02/15/2016 08:58 PM IST
Will go to jail no need of bail says mla vamsi mohan

పోలీసులు తన మీద పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా... స్వచ్ఛందంగా లొంగిపోవాలని, స్టేషన్ బెయిల్ కూడా తీసుకోకుండా జైలుకు వెళ్లాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్ణయించుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని రామవరప్పాడులో పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపునకు యత్నించిన మునిసిపల్ అధికారులను ఆయన అడ్డుకున్నారు. అంతేకాక నోటీసులు ఇవ్వకుండా గుడిసెల తొలగింపునకు వచ్చిన అధికారుల తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై పేదలతో కలిసి ధర్నాకు దిగారు. దీంతో అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామైంది. దీనిపై ఉన్నతాధికారులకు వివరాలు చెప్పిన పటమట పోలీసులు వల్లభనేనిపై కేసు నమోదు చేశారు.

ఈ సమాచారం అందుకున్న వంశీ డీజీపీ రాముడుకు లేఖ రాసి.. సమాధానం రాకముందే మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయన తన ఇద్దరు గన్‌మెన్‌ను కూడా వెనక్కి పంపారు. తన మీద కేసు పెట్టడం వెనక పార్టీలో జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఒత్తిడి ఉందని ఆయన వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వంశీని బుజ్జగించేందుకు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చల అర్జునుడు సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. అధికారులు ఏ ధైర్యంతో తన మీద కేసు పెట్టారని ఈ సందర్భంగా వంశీ వాళ్లను అడిగారు.

ధర్నాను విరమింపజేయడానికి తాను వెళ్తే.. ధర్నాలో తనను ఎ1గా పేర్కొంటూ కేసు పెట్టడం ఏంటని నిలదీశారు. కలెక్టర్ ద్వారా తన మీద కేసు పెట్టించడానికి ప్రయత్నించిన అధికార పార్టీ నేతలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దాంతో ఎంపీ నారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు అర్జునుడు.. వంశీకి ఎలాగోలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తం విషయాన్ని నేరుగా సీఎంకు వివరిస్తామని, ఆందోళన కార్యక్రమాన్ని విరమించాలని, పోలీసు స్టేషన్‌కు కూడా వెళ్లొద్దని కోరారు. కాసేపట్లో సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసి అన్ని విషయాలనూ వంశీ ఆయన దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. అయితే ఈ వివాధం టీ కప్పులో తుఫానుగా చల్లరుతుందని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vallabhaneni vamsi mohan  gannavaram mla  jail  station bail  ramavarapadu  patamata police  

Other Articles