Revanth Reddy said that wish naxalism in Telangana state

Revanth reddy said that wish naxalism in telangana state

Revanth Reddy, Telangana, Naxalism, Naxals, KCR, TDP, TRS

Telangana TeluguDesam Party fire brand Revanth Reddy contraversial statements telangana govt. He said that wish naxalism in Telangana state.

నక్సలిజం వస్తే బాగుంటుందన్న రేవంత్

Posted: 02/15/2016 08:15 AM IST
Revanth reddy said that wish naxalism in telangana state

తెలంగాణలో టిడిపి పరిస్థితి అయోమయంలో పడిన నేపథ్యంలో టిటడిపి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలు తమ పార్టీని వదిలి కారెక్కుతున్నారన్న ఫ్రస్టేషన్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు చాలా మంది భావిస్తున్నారు. తెలంగాణలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో నక్సలిజం వస్తే బావుంటుందంటూ కామెంట్ చేశారు. . టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడిందని ప్రజలంతా అఖిల పక్షంగా ఏర్పడి అరాచకాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణలో బిహార్ మాదిరిగా అరాచక పాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. ప్రజలంతా అఖిలపక్షంగా ఏర్పడి అరాచకాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని ఆరోపించిన రేవంత్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే నక్సలైట్లు ఉంటే బాగుండేదనిపిస్తోందన్నారు. ఒకప్పుడు నక్సలిజం అనేది అభివృద్ధి విరోధకంగా ఉండేదనుకున్నానన్న రేవంత్ యూనివర్సిటీల్లోని యువత నక్సలిజం వైపు మొగ్గు చూపుతోందన్నారు. సాగర్, శృతి ఇలానే నక్సలిజంలోకి వెళ్లి వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Telangana  Naxalism  Naxals  KCR  TDP  TRS  

Other Articles