Fervour marks Rathasapthami festival

Rathasapthami festivities begins statewide

rathasapthami, festival, tirumala, devotees, temples, pilgrims, tirumala, arasavelli suryanaranyana temple, mada veedhulu, saptha vahana seva, surya prabha vahanam, chinna shesha vahanam, hanumantha vahanam, chandra prabha vahanam, tiruchanur padmavathi temple,

rathasapthami festivities begins statewide, special pujas performed in temples, while tirumala srivaru is surrounding in mada streets on saptha vahanalu.

తెలుగు రాష్ట్రాలలో కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు..

Posted: 02/14/2016 09:56 AM IST
Rathasapthami festivities begins statewide

రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పరమ పవిత్రమైన రథసప్తమిని పురస్కరించుకుని తిరుచానూరు పద్మావతి అశ్వవాహనంపై సూర్యభగవానుడిని ఊరేగించారు. అటు అరసవెళ్లి సూర్యదేవాలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి.

రథసప్తమి సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఉదయం నుంచి రాత్రి వరకూ సప్తవాహన సేవలు, చక్రస్నానం నిర్వహించనున్నారు. వేకువ జామునే తిరుమల శ్రీవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో సంచరించి భక్తులకు అభయ ప్రధానం చేశారు. ఆ తరువాత ఉదయం తొమ్మిది గంటలకు చిన్నశేష వాహనంపై ఊరేగిన శ్రీవారు 11 గంటలకు గరుడ వాహనంలో మాఢ వీధ్లుల్లో విహరించనున్నారు. మధ్యాహ్నం హనుమంతవాహనం, చక్రస్నానం, సాయంత్రం కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, చంద్ర వాహనంపై శ్రీవారు నాలుగు మాడా వీధుల్లో ఊరేగనున్నారు. రథసప్తమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rathasapthami  festivities  tirumala  saptha vahana seva  

Other Articles