Sushil Koirala | passes away | Nepal | prime minister | Narendra Modi tweets

Former nepal prime minister sushil koirala passes away

Former Nepal prime minister Sushil Koirala passes away, Sushil Koirala passed away, Sushil Koirala died, Sushil Koirala death news, Sushil Koirala no more, Nepal prime minister died, Sushil Koirala stills

Nepal prime minister Sushil Koirala passes away: Sushil Koirala was the Prime Minister of Nepal from 11 February 2014 to 10 October 2015. He was also President of the Nepali Congress party beginning in 2010. He died on monday night, 9th February 2015.

నేపాల్ మాజీ ప్రధాని సుశీల్ కొయిరాల కన్నుమూత

Posted: 02/09/2016 10:14 AM IST
Former nepal prime minister sushil koirala passes away

నేపాల్ మాజీ ప్రధాన మంత్రి సుశీల్ కొయిరాల(78) నిన్న రాత్రి ఖట్మాండులో కన్నుమూశారు. న్యూమోనియా, శ్వాసకోశ వ్యవస్థ పనిచేయకపోవడంతో సుశీల్ కొయిరాలా తన తుదిశ్వాస విడిచారని ఆయన వ్యక్తిగత వైద్యుడు కబీర్ నాథ్ యోగి తెలిపారు.

సుశీల్ కొయిరాలా భౌతికకాయాన్ని ఖట్మాండులో నేపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యలయానికి తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కొయిరాలా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా సంతాపం తెలిపారు. కొయిరాలా నిరాడంబరుడని పేర్కొన్నారు. కొయిరాలా కుటుంబానికి, నేపాల్ ప్రజలకు సానుభూతి ప్రకటించారు.

నేపాల్ ప్రధానిగా ఎన్నికైన ఆయన ఆ దేశ కొత్త రాజ్యాంగంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో 2014 ఫిబ్రవరి 10న తన పదవికి రాజీనామా చేశారు. 1939, ఆగస్టు 12న భారత్ లోని బెనారస్ లో జన్మించిన సుశీల్ కొయిరాలా 1954లో రాజకీయాల్లోకి వచ్చారు. 1960లో ఆ దేశంలో రాజరిక పాలన నేపథ్యంలో 16 ఏళ్ల పాటు రాజకీయ బహిష్కరణకు గురయ్యారు. అంతేకాక 1973లో విమానం హైజాక్ ఆరోపణలతో మూడేళ్ల పాటు జైలు జీవితం కూడా గడిపారు. సుశీల్ కొయిరాలా ముగ్గురు సోదరులు మాత్రిక ప్రసాద్ కొయిరాలా, గిరిజా ప్రసాద్ కొయిరాలా, బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాలా కూడా నేపాల్ ప్రధానులుగా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sushil Koirala  Passes away  Death news  Nepal prime minister  

Other Articles