cards distribution for divorce settlement in warangal district

Divorce invitation cards distributed to defame wife in warangal

divorce invitation, cards distribution, divorce settlement, warangal district, husband suresh, wife uma, defaming wife, aahwanam movie, sv krishna reddy, srikanth, ramya krishna

husband defames wife by distributing fake divorce invitation cards in her home town in warangal, five persons arrested

సతిపై కోపంతో .. పతి ‘ఆహ్వానాలు’ .. పోలీసుల అదుపులో ఐదుగురు

Posted: 02/09/2016 09:56 AM IST
Divorce invitation cards distributed to defame wife in warangal

శ్రీకాంత్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలలో నటించిన చిత్రం, వివాహ సంబంద బాంధవ్యాల పవిత్రత, ప్రాముఖ్యతను చాటిచెపుతూ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కి.. తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఆహ్వానం సినిమా.. వరంగల్ జిల్లాలో అక్షర రూపం దాల్చింది. భార్యతో గొడవపడి పుట్టింటికి పంపించిన ఓ ప్రబుద్ధుడు.. తన సతిపై కోపం పెంచుకుని తమ వివాహ బందాన్ని తెంచుకునేందుకు, తన బార్య కుటుంబికుల పరువును బజారు పాలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి తమ విడాకుల పంచాయితీకి రావాలంటూ విడాకుల పంచాయితీ అహ్వానాలు పంచిన నేపథ్యంలో అహ్వానం సన్నివేశం అవిష్కృతమైంది.

వివరాల్లోకి వెళ్తే.. నారాయణగిరికి చెందిన ముత్తోజు వెంకట్రాజం, రాజమణి దంపతుల కుమార్తె ఉమకు నాలుగున్నర సంవత్సరాల క్రితం దుగ్గొండికి చెందిన కలకొండ సురేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ పాప. మూడు రోజుల క్రితం భార్యతో గొడవపడిన సురేష్ ఆమెను పుట్టింటికి పంపించాడు. బావమరిది రమేష్‌తోనూ గొడవపడ్డాడు. ఈ క్రమంలో సోమవారం సురేష్ మరో ఐదుగురితో కలిసి నారాయణగిరికి వచ్చి ఈ నెల 14న జరిగే ‘విడాకుల పంచాయితీకి ఆహ్వానం’ అని ముద్రించిన కరపత్రాలు ఇంటింటికీ పంపిణీ చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారిని పట్టుకోగా, సురేష్ తప్పించుకున్నాడు. మిగితా ఐదుగురిని ఆరా తీయగా తమకు చదువురాదని, రూ. 300 కూలి ఇస్తామంటే వచ్చి కరపత్రాలు పంచుతున్నామని తెలిపారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి ఉమ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles