EVMs not worked properly in GHMC Polling

Evms not worked properly in ghmc polling

GHMC, EVMs, Polling, Kondapur, Somajiguda

Some EVM Machines not worked properly in the first two hours. After some time officials replace those EVMs

అక్కడక్కడ మొరాయించిన ఈవిఎంలు

Posted: 02/02/2016 10:49 AM IST
Evms not worked properly in ghmc polling

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అయితే పలు చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈవీఎం యంత్రాలు మొరాయించాయి. హయాత్ నగర్, వనస్థలిపురం, రామాంతపూర్, కూకట్ పల్లి, కొండాపూర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ లలో ఇంకా ఓటింగ్ ప్రారంభం కాలేదు. మైలార్ దేవ్ పల్లి లక్ష్మీగూడలో, హయత్ నగర్ సిద్దార్థ్ స్కూల్ లో, కొండాపూర్ లోని 33, 34, 35 పోలింగ్ కేంద్రాల్లో, కేపీహెచ్ బీ కాలనీలో 5,6,7,8,9,10 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మెరాయించినట్టు తెలుస్తోంది. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తాయని, అందుకే పోలింగ్ ఆలస్యం అయిందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే తాము నిపుణులను పంపామని, ఈవీఎంలను సరి చేస్తామన్నారు. ఒకవేళ ఆ ఈవీఎంలు పని చేయకుంటే వాటిని మార్చేస్తామని వెల్లడించారు.

మరో పక్క గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అత్యాధునికమైన ఇంటిగ్రేటేడ్ ఈ-సర్వేలేన్స్ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని, బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు కమెండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 811 సమస్యాత్మక, 286 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. కాగా సోమాజిగూడలో కాంగ్రెస్ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ టోపీలు, కరపత్రాలతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమాజిగూడలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  EVMs  Polling  Kondapur  Somajiguda  

Other Articles