Chandrababu naidu responsible for tuni agitation

Chandrababu naidu responsible for tuni agitation

chandrababu Naidu, kapu, kapu garjana, Tuni, Tuni Railway station, Chandrababu on Tuni incident

Kapu garjana took violence face in tuni. Kapu leaders burn a train and police station. But chandrababu Naidu said that these incidents took place by one person.

తుని హింసకు పరోక్ష కారణం చంద్రబాబే

Posted: 02/01/2016 11:36 AM IST
Chandrababu naidu responsible for tuni agitation

అవును.. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు వల్లే నిన్న తునిలో కాపు గర్జన కాస్తా హింసాత్మకంగా మారింది. ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన కాపు గర్జనలో కీలక మలుపు తిరగడానికి, కాపు సామాజిక వర్గానికి చెందిన వారు హింసకు పాల్పడడానికి ఓ రకంగా చంద్రబాబు నాయుడే కారణం. ముద్రగడ పద్మనాభం మాటల వల్లే తునిలో హింసచెలరేగిందని... పరోక్షంగా ఓ నాయకుడు మొత్తం వ్యవహారానికి సహకరిస్తున్నారని వాదిస్తున్న చంద్రబాబు నాయుడు గుర్తించాల్సిన కొన్ని నిజాలు....

 * కాపు రిజర్వేషన్ల కోసం ప్రస్తుతం జరుగుతున్న పోరాటం.. ఇప్పటికిప్పుడు ప్రారంభించింది కాదు
 * కాపు సామాజిక వర్గానికి తగిన న్యాయం చేస్తామని.. చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కూడా ఎన్నికల సమయంలో హామీలిచ్చారు. కానీ తర్వాత ఆ హామీలను మరిచారు.
 * తునిలో కాపు గర్జనకు దాదాపు రెండు నెలల నుండి ముద్రగడ పద్మనాభం ఏర్పాట్లు చేశారు. అందుకుగాను ముందుగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ఒకేతాటిపైకి తీసుకువచ్చారు. కాగా సభ భారీగా జరగనుంది అని ముందుగా గుర్తించలేకపోవడం ప్రభుత్వ నిఘా వైఫల్యం కిందకే వస్తుంది.
 * ల‌క్ష‌ల సంఖ్య‌లో జ‌నం త‌ర‌లివ‌స్తున్న‌ప్పుడు ఎటువంటి ముప్పు వ‌స్తుందోనన్న జాగ్ర‌త్త‌లతో భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేయాలి. అందులోనూ ఆగ్ర‌హంతో ఉన్న త‌ర‌గతులు రోడ్డెక్కుతున్న‌ప్పుడు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. ప్ర‌త్యేక ర‌క్ష‌ణ ద‌ళాల అవ‌స‌రం తో పాటు ఫైర్ ఇంజన్లు స‌హా అనేక ఏర్పాట్లు ఉండాలి.
 *  చివ‌ర‌కు రైలు త‌గుల‌బ‌డుతుంటే అప్ప‌టిక‌ప్పుడు ఫైర్ ఇంజ‌న్ల కోసం విశాఖ జిల్లాకు చెందిన వారిపై ఆధార‌ప‌డ‌డం చూస్తుంటే ప్ర‌భుత్వ ఉద్దేశం స్ప‌ష్ట‌మ‌వుతోంది.
 * కాపు గర్జనకు . కేవ‌లం తొమ్మిది మంది డీఎస్పీలు, ఇత‌ర కింది స్థాయిని సిబ్బందిని వెయ్యి మంది వ‌ర‌కూ మాత్ర‌మే ఈ స‌భ‌కు కేటాయించ‌డం చూస్తే అస‌లు స‌ర్కారు తీరు ఏమిట‌న్న‌ది అర్థం కాకుండా ఉంది. ఎస్పీ స్థాయి స‌హా ఇత‌ర ఉన్న‌తాధికారులు ఉండాల్సిన చోట దానికి భిన్నంగా ఎందుకు సాగింద‌న్న‌ది తెలియాల్సి ఉంది.
 * కాపు గ‌ర్జ‌న ఏర్పాట్ల‌కు కూడా ఆటంకం క‌ల్పించ‌డంతో అగ్నికి ఆజ్యం తోడ‌య్యింద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. అందుకే ఊహించిన దానిక‌న్నా ఎక్కువ‌గా కాపు యువ‌త క‌దం తొక్కారు. పెద్ద సంఖ్య‌లో క‌ద‌లి వ‌చ్చారు. చివరకు గర్జన కాస్తా హింసాత్మకంగా మారింది.
 * కాపుల‌ను బీసీల్లో చేర్చ‌డం వ‌ల్ల వ‌చ్చే అనేక స‌మ‌స్య‌లు దృష్టిలో ఉన్న‌ప్ప‌టికీ కేవ‌లం ఎన్నిక‌ల్లో ఓట్ల కోసం నాది బాధ్య‌త అంటూ చెప్పేసి..రేవు దాటాక తెడ్డు త‌గ‌లేసే ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తూ సీఎం ఇప్పుడు స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్ట‌డ‌మేమిటి..బీసీల్లో ఆగ్ర‌హం వ‌స్తుంద‌ని ముందే ఆయ‌న‌కు తెలియ‌దా..తెలిసినా ఓట్ల కోస‌మే కాబ‌ట్టి ఇంత ఆగ్ర‌హం వ‌స్తుంద‌నుకోలేదా..?
 * జీవో ఇచ్చేస్తే త‌ర్వాత మీరే ఇబ్బందులు ప‌డతారంటూ బెదిరిస్తున్న సీఎం మ‌రి ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను ప‌గ‌డ్బందీగా ఇస్తూ స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కూడా తెలియ‌దా..అవ‌న్నీ తెలియ‌కుండానే కాపుల‌ను బీసీల్లో చేర్చుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారా..?
 * మంజునాథ క‌మిష‌న్ వేశాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు ..అస‌లు మంజునాథ అనే జ‌స్టిస్ పూర్తిగా రిజ‌ర్వేష‌న్ల వ్య‌తిరేకి అన్న వాస్త‌వం తెలియ‌దా..లేక త‌ప్పుదారి ప‌ట్టించాల‌నే ఆయ‌న్ని క‌ర్ణాట‌క నుంచి ప‌ట్టుకొచ్చారా అంటే స‌మాధానం క‌నిపించ‌దు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu Naidu  kapu  kapu garjana  Tuni  Tuni Railway station  Chandrababu on Tuni incident  

Other Articles