Mudragada Padmanabham said that he will do hunger strike with in four or five days

Mudragada padmanabham said that he will do hunger strike with in four or five days

Kapu, mudragada padmanabham, kapu garjana, kapu Reservation

Kapu group leader Mudragada Padmanabham clear that he will protest till get reservation for kapu group.

ITEMVIDEOS: నాలుగు ఐదు రోజుల్లో ముద్రగడ ఆమరణ దీక్ష

Posted: 02/01/2016 01:10 PM IST
Mudragada padmanabham said that he will do hunger strike with in four or five days

నిన్న తునిలో జరిగిన ఘటన మీద, కాపుల రిజర్వేషన్ల మీద ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రెస్ ముందు మాట్లాడారు. తాను చేస్తున్న ఉద్యమం ఆకలి బాదను తీర్చడానికే అని.. జాతికి తాను చేస్తున్న సేవ అని అన్నారు. కాగా తాము రోడ్ల మీదకు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే అని ముద్రగడ పద్మనాభం అన్నారు.

పద్మనాభం మాటల్లో ముఖ్యాంశాలు...

* ప్రత్యేక విమానాల్లో పర్యటనలు చేస్తారు... కానీ మా జాతి వారికి డబ్బులు మాత్రం లేవు
*పట్టిసీమకు 1400 కోట్లు కేటాయిస్తారు కానీ మమ్మల్ని పట్టించుకోరు
* మా పరిస్థితి కరివేపాకు కంటే దారుణంగా మారింది
* ఉద్యమం శాంతియుతంగా చేస్తాం
* ఐదు నెలలు గడిచినా ఎలాంటి సమాధానం రాలేదు.. దాంతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది
* బీసీ కోటాలో పెసర కూడా తియ్యనక్కర్లేదు
* కమీషరన్ పేరుతో కాలయాపన తప్పిదే.. ఇంకేం లేదు
* నాతోపాటు నా భార్య కూడా ఆమరణ దీక్ష చేస్తారు
* ప్రభుత్వం దిగి రాకుంటే నాలుగు ఐదు రోజుల్లో ఆమరణ దీక్షకు దిగుతా
 * మా ఉద్యమం ఎవరికి వ్యతిరేకం కాదు
 * బీసీల్లో కలపాలన్నది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్
 * నేను, నా జాతి అమ్మడుపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం
 * కాపు వర్గీయులను రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు
 * అరెస్టు చేసినా సరే.. జైలులో ఆమరణ దీక్ష చేస్తాను
 * కాపులు ఆకలి పోరాటం
 * మా జాతికి మేలు చెయ్యాలనే ఉద్యమిస్తున్నా
 * ప్రభుత్వం నేరాన్ని ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేస్తోంది
 * మేం ఏ పార్టీకి వ్యతిరేకం కాదు.. అలాగనీ ఎవరికీ అనుకూలం కాదు
  * గర్జన తేదీ ప్రకటించిన నాటి నుండే విమర్శలు చేయించారు
 * ఈ వయస్సులో నాకు రాజకీయ ప్రయోజనాలు అనవసరం
 * తుని ఘటనకు పూర్తిగా ప్రభుత్వ బాధ్యతే
 * టీడీపీ హామీ ఇచ్చింది కాబట్టే అడుగుతున్నాం
 * హింసకు కారకులు టీడీపీ నాయకులే
 * క్షణికావేశంలో నిన్న హింస చోటుచేసుకుంది

చంద్రబాబుకు ముద్రగడ అల్టిమేటం

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu  mudragada padmanabham  kapu garjana  kapu Reservation  

Other Articles