Medico suicide for eve teasing in Lucknow

Medico suicide for eve teasing in lucknow

Medico, Suicide, Eve teasing, Lucknow, Sarika Gupta

In a yet shocking incident in the state capital, the police’ role has come under scrutiny that has cost the life of a college going girl who committed suicide on Friday evening, post suffering continuous eve teasing. Sarika Gupta hanged herself to death at her residence in Kalyanpur area.

వేధింపులు భరించలేక మెడికో ఆత్మహత్య

Posted: 01/31/2016 12:39 PM IST
Medico suicide for eve teasing in lucknow

ర్యాగింగ్ భూతం విద్యార్థుల పాలిట దెయ్యంలా మారింది. ర్యాగింగ్ దెబ్బతో మరో విద్యార్థిని అసువులు బాసింది. వేధింపుల కారణంగా సారికా గుప్తా అనే ఓ 22 ఏళ్ళ వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వికాస్‌-నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ మెడికల్‌ కాలేజీ విద్యార్థిని సారికా గుప్తా ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా ఆమెను ఓ యువకుడు వేధిస్తున్నాడని, ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా ఎలాంటి ఫలితమూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు.

స్థానికంగా ఎంబీఏ చదివే అజయ్‌ విశ్వకుమార్‌ అనే యువకుడిపై మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెపై యాసిడ్‌ పోస్తానంటూ అజయ్‌ బెదిరించాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తమ కుమార్తె నిరంతరం తనను వేధిస్తున్న ఆ ఈవ్ టీజర్-పై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కనీసం 1090 హెల్ప్-లైన్ విభాగం కూడా స్పందించలేదని విద్యార్థిని తండ్రి ఆవేదనతో ఆరోపించారు. మెడికో ఆత్మహత్య చేసుకున్న తరువాత మాత్రమే అజయ్ విశ్వకర్మ అనే పోకిరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం విమర్శలకు దారి తీసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medico  Suicide  Eve teasing  Lucknow  Sarika Gupta  

Other Articles