30-Foot Whale Dead On Mumbai's Juhu Beach

30 foot whale dead on mumbai s juhu beach

Juhu Beach, Mimbai, Whale, Whale dead on Mumbai beach

A 30-foot whale washed up on the Juhu beach in Mumbai on Thursday night. The whale, said to weigh around four tonnes, was spotted after 10 pm. Police and forest Department officials are examining the animal, which experts say is a Bryde's whale.

ITEMVIDEOS: 30 అడుగుల భారీ తిమింగళం.. చూశారా..?

Posted: 01/30/2016 08:23 AM IST
30 foot whale dead on mumbai s juhu beach

ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా ముప్పై అడుగుల భారీ తిమింగళం ముంబై తీరానికి కొట్టుకువచ్చింది. ఆ తిమింగళం సుమారు నాలుగు టన్నులు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గురువారం రాత్రి పది గంటల తర్వాత తిమింగళం తీరానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆ భారీ తిమింగళాన్ని  బ్రైడ్ జాతికి చెందినట్లుగా జంతుశాఖ అధికారులు గుర్తించారు. దాన్ని తరలించేందుకు క్రేన్లను తీసుకొచ్చారు. మూడు రోజుల క్రితం తిమింగళం మృతిచెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.


సముద్ర నీటిలో కలిగే ధ్వని కాలుష్యం వల్లనో లేక పరిశ్రమల నుంచి వెలుబడే వ్యర్థాల వల్లనో లేక ప్లాస్టిక్‌ను మింగడం వల్లనో భారీ జలాచరం మరణించి ఉంటుందని రీఫ్‌వాచ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది కూడా మహారాష్ట్ర బీచ్‌కు భారీ బ్లూ వేల్ కొట్టుకువచ్చింది. దాదాపు పది గంటల పాటు ప్రాణాలతో పోరాడి చివరకు మరణించింది. ఇదే నెలలోనూ తమిళనాడు బీచ్‌కు సుమారు 45 చిన్నపాటి తిమింగళాలు కొట్టుకు రాగా.. తాజా ఈ భారీ తిమింగళం కూడా కొట్టుకురావడం చర్చనీయాంశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Juhu Beach  Mimbai  Whale  Whale dead on Mumbai beach  

Other Articles