India fears about Zika Virus

India fears about zika virus

Zika Virus, Zika Virus in India, Uganda, America

Even though the World Health Organisation (WHO) is considering conducting an emergency meeting soon to decide whether to declare a public health emergency after it announced that Zika virus is spreading explosively in America, health officials here say not a single case has so far been reported in India and asserted there was nothing to panic.

భారత్ కు జీకా వైరస్ భయం

Posted: 01/29/2016 12:41 PM IST
India fears about zika virus

మొన్న హెచ్.ఐ.వీ .. నిన్న ఎబోలా..నేడు జీకా వైరస్. ఇప్పుడు మానవాళిని భయపెడుతున్న ప్రమాదాలు. జికా వైరస్ బ్రెజిల్ వాసుల్ని భయకంపితుల్ని చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ అబార్షన్లకు అనుమతి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు జికా వైరస్ బారిన పడిన వారికి అబార్షన్ కు అనుమతి ఇవ్వాలని కోరుతూ బ్రెజిల్ అత్యున్నత న్యాయస్ధానంలో పిటిషన్ వేశారు.  అయితే ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఈ వైరస్ కు భయపడుతున్నాయి. భారత్ లో దీని వ్యాప్తి ఎలా ఉంటుందో అని అధికారులు భయం వ్యక్తం చేస్తున్నారు.

1947 లో ఉగాండాలోని జీకా అటవీ ప్రాంతంలో ఉన్న కోతుల్లో కనుగొన్న ఈ వైరెస్ ను అప్పటి నుంచీ 'జీకా వైరెస్' అని పిలుస్తారు. ఈ వైరెస్ లాటిన్ అమెరికా, బ్రెజిల్, కొలంబియా లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెంది ఉంది. ఈ వైరెస్ భారిన ఎక్కువగా గర్భిణీ స్త్రీలల్లో ఉంటుంది. ఈ వైరెస్ సోకితే గర్భస్రావం జరగడమో.. లేదా పుట్టే బిడ్డ తల సరిగ్గా ఎడగకుండా ఉండడమో జరుగుతుంది. కాగా ఈ వైరెస్ ఎక్కువగా దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది. శృంగారం ద్వారాకూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. 2015, 16 ఏడాదిల్లో బ్రెజిల్ లో అత్యధికంగా 4000 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధికి ఎటువంటి వ్యాక్సిన్స్ గానీ, మందులు కానీ లేవు. కనుక ఈ వ్యాధికి మందులు పనుగొనే ప్రయత్నం చేయాలని యూఎస్ ప్రెసిడెంట్ ఒబామా శాస్త్రజ్ఞులకు తెలిపాడు.

కొన్ని దేశాలు తమ దేశ స్త్రీలు గర్భం దాల్చవద్దని మరో నాలుగు సంవత్సరం పాటు వాయిదా వేసుకొంటే మంచి దని చెబుతున్నాయి. ప్రధానంగా ఎన్ సెల్వి డర్, కొలంబియా దేశాలు తమ స్త్రీలకు తెలుపుతున్నాయి. మరికొన్ని దేశాలు ఈ వ్యాధి బాగా వ్యాప్తి ఉన్న 20 దేశాలకు వెళ్లొద్దంటున్నారు. దీంతో పలు మహిళా, శిశు సంక్షేమ సంగాలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఏకంగా అమెరికా అయితే గర్భీణీ స్త్ర్రీలు వేరే దేశాలకు ప్రయాణం చేయవద్దని తామే ఆ టికెట్ మనీ ఇస్తామని ప్రయాణం వాయిదా వేసుకోమని చెబుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zika Virus  Zika Virus in India  Uganda  America  

Other Articles