Tourists Mistaken For Terrorists

Tourists mistaken for terrorists

Terrorists, Tourists, Iran, Vishakapatnam, Bhivaneshwar, Odissa

Three men and two women detained in Andhra Pradesh’s Visakhapatnam last night on the suspicion that they are terrorists may just be innocent tourists, police sources say. The group was held on a request from Odisha, which believes that they vanished from a hotel in a suspicious way. They are all carrying Iranian passports, the police say. Sources say the five were not able to communicate because of a language problem.

వాళ్లు ఉగ్రవాదులు కాదు.. పర్యాటకులు

Posted: 01/28/2016 10:57 AM IST
Tourists mistaken for terrorists

కలకలం రేపిన ఉగ్రవాదుల ఎస్కేప్ వార్త చివరకు నిజం కాదు అని అనిపిస్తోంది. భువనేశ్వర్ నుండి ఓ కారులో ఐదుగురు అనుమానితులు కారులో తప్సించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అరిపబ్లిక్ డే సందర్భంగా ఉగ్రవాదులు దేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో అన్ని చోట్లా పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్న విషయం తెలిసిందే. పోలీసులు తమకు అందిన సమాచారంతో అన్ని రాష్ట్రాల పోలీసులకు, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. దాంతో వారి కోసం గాలింపు గట్టిగా సాగింది.

ఒడిశాలోని భువనేశ్వర్ లోని ఓ హోటల్ లో అద్దెకు వచ్చి.. ఐడీ ప్రూఫ్ చూపించమంటే చెప్పకుండా ఉడాయించారని ఆ హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే వారి సమాచారంతో ఆ ఐదు గురు ఎవరు అన్న అనుమానంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే విశాఖపట్టణంలో ఐదుగరు ఇరానియన్లను గుర్తించిన పోలీసులు.. ఉగ్రవాదులుగా అనుమానం వ్యక్తం చేస్తూ వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు మామూలు టూరిస్టులను తెలుస్తోంది. ఒడిశా నుండి స్పెషల్ టీం ఇంటరాగేషన్ చేసిన తర్వాత వారిని వదిలివేసే పరిస్థితి కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terrorists  Tourists  Iran  Vishakapatnam  

Other Articles