Girl sent to jail for manhandling traffic cop

Girl sent to jail for manhandling traffic cop

Girl Attacked on Police, BTech Student attack on Police, Birl beat Police constable, Girl manhandled a traffic constable

Harshita, a B.Tech final year student who abused and manhandled a traffic constable for clicking her picture while driving her bike in the wrong route, has been remanded to a two-week judicial custody on Wednesday. The girl was sent to Chanchalguda jail on the orders of a city court.

హోంగార్డును కొట్టిన అమ్మాయి చంచల్ గూడ జైలుకు

Posted: 01/28/2016 12:44 PM IST
Girl sent to jail for manhandling traffic cop

రాంగ్ రూట్ లో వచ్చినందుకు ఫోటో తీస్తే ఏకంగా హోంగార్డ్ చెంప ఛెళ్లుమనిపించిన అమ్మాయికి కోర్టు రిమాండ్ విధించింది. నిన్న హైదరాబాద్ శివారులోని కీసర మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన మీద తెలుగు మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా వార్తలను ప్రచురించింది. అర్పిత అనే అమ్మాయి తన ఫోటో తీసిన హోంగార్డ్ ను కొట్టడం.. అతడిని తిట్టడం మొత్తం వీడియోలో రికార్డు కావడం.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియా ట్రెండ్ కావడంతో పోలీసులు అమ్మాయి మీద కేసు నమోదు చేసి.. కస్టడీలోకి తీసుకున్నారు.

Also Read: హోంగార్డ్ చెంప ఛెళ్లుమనిపించిన యువతి

హైదరాబాద్ శివారులోని కీసర మండలం దమ్మాయిగూడకు చెందిన హర్షిత ఇంజినీరింగ్ చదువుతోంది. నిన్న సాయంత్రం ఆమె తన ద్విచక్రవాహనంపై నాగారం గ్రామం మీదుగా స్వగ్రామానికి వెళ్లేందుకు రాంగ్‌రూట్‌లో వెళ్తోంది. దమ్మాయిగూడ చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న మల్కాజిగిరి ట్రాఫిక్ ఠాణాకు చెందిన హోంగార్డు వెంకటేష్ ఈ విషయం గమనించి తన వద్ద ఉన్న కెమెరాలో యువతి వాహనాన్ని ఫొటో తీశాడు. ఇది గమనించిన హర్షిత హోంగార్డుతో వాగ్వాదానికి దిగింది. తన ఫొటో ఎందుకు తీశావని ఆమె ప్రశ్నించగా.. రాంగ్‌రూట్‌లో వెళ్లినందుకు జరిమానా విధించేందుకు ఫొటో తీశానని వెంకటేష్ బదులిచ్చాడు. కెమెరా నుంచి ఫొటో తొలగించాలని ఆమె డిమాండ్ చేసింది. ఈక్రమంలో అతడితో గొడవకు దిగింది. హోంగార్డు కాలర్ పట్టుకొని చెంప చెల్లుమనిపించింది. అయితే అమ్మాయిని కోర్టుకు తరలించగా.. ఆ అమ్మాయికి, అమ్మాయితో పాటు ఉన్న వ్యక్తికి కూడా కోర్టు రెండు వారాల పాటు రిమాండ్ విధించింది. ఆ అమ్మాయిని చంచల్ గూడ జైలుకు తరలించగా.. అమ్మాయితో పాటు ఉన్న వ్యక్తిని చర్లపల్లి జైలుకు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles