All set to Eight thousand eighty six DSC teacher jobs in AP

All set to eight thousand eighty six dsc teacher jobs in ap

DSC, AP, Jobs, DSC in AP, AP Jobs, Jobs in AP Govt, Ganta Srinivas

After a long gap ap govt getting ready to allot Job vaccancies in the teaching fied by DSC.

ఏపిలో 8,086 టీచర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్‌

Posted: 01/23/2016 03:36 PM IST
All set to eight thousand eighty six dsc teacher jobs in ap

తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాంతో గ్రూప్స్, డిఎస్సి, పోలీస్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్లకు జారీ చేసింది. అయితే ఏపిలో మాత్రం ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ వెల్లడికాలేదు. అయితే తాజాగా డిఎస్సీ కోసం ఏపి ప్రభుత్వానికి లైన్ క్లీయర్ అయినట్లు కనిపిస్తోంది. 8వేల 86 పోస్టులను ఫిబ్రవరిలో భర్తీ చేస్తామని మంత్రి గంటా తెలిపారు. దీంతో ఫలితాలు వచ్చినా ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై.. నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. డీఎస్సీ-2014 రాతపరీక్షల్లో అర్హత సాధించిన 8,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్‌ చేసింది. ఇంతవరకు ఉన్న కోర్టు కేసులు కొలిక్కిరావడం, GAD అనుమతి కూడా లభించడంతో వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టేందుకు కసర్తతు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ నియామకాలు ఉంటాయని ఏపి విద్యా శాఖ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మిగిలిన పోస్టులపై కోర్టు స్పష్టత ఇవ్వాల్సి ఉందని తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులకు సంబంధించి కోర్టుకు తీర్పుకు లోబడి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఉమ్మడి సర్వీస్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు గంటా వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DSC  AP  Jobs  DSC in AP  AP Jobs  Jobs in AP Govt  Ganta Srinivas  

Other Articles