HRD Minister sends two member team to probe

Hrd minister sends two member team to probe

HRD Minister, Hyderabad Central University, Smruthi Irani, Rohit, ABVP, Bandaru Dattatreya

The team has been directed to submit report on the death of the Dalit PhD scholar who was found hanging at the hostel room of the Central University campus yesterday. "V Rohit (around 26) was found hanging in the hostel room. He was among the five research scholars who were suspended by Hyderabad Central University (HCU) in August last year and also one of the accused in the case of assault on a student leader", said Hyberabad Police Commissioner C V Anand.

ITEMVIDEOS: హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్యపై దిల్లీలో సెగలు

Posted: 01/18/2016 05:42 PM IST
Hrd minister sends two member team to probe

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు రోహిత్ ఆత్మహత్య మీద అగ్గిసెగలు అంటుకున్నాయి. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మీద ఇప్పటికే కేసు నమోదు కాగా కేంద్ర మానవ వనరుల మంత్రి స్ర్ముతి ఇరానీకి కూడా ఈ ఘటన మీద వేడి తగిలింది. ఏబీవీపి విద్యార్థి నాయకుల మీద దాడికి పాల్పడ్డారని.. అందుకు రోహిత్ తో సహా పలువురు విద్యార్థులను సస్పెండ్ చెయ్యాలని లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి స్ర్ముతి ఇరానీ మీద విమర్శలు వస్తున్నాయి. అయితే దిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటికి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు స్ర్ముతి ఇరానీ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రాజకీయాలు నడుస్తున్నాయని క్లీయర్ గా కనిపిస్తోంది. అక్కడి సంఘాల్లో చోటుచేసుకున్న వివాదాలు చిలికిచిలికి గాలి వానగా మారాయి. రోహిత్ ఆత్మహత్యతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రోహిత్ ది ఆత్మహత్యగా కాకుండా హత్యగా పోలీసులు కేసు నమోదు చెయ్యాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా దీని మీద కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్రం తరఫున ఓ దర్యాప్తు బృందం రేపు హైదరాబాద్ చేరుకొని.. ఇక్కడ పరిస్థితి మీద ఆరా తీయనుంది. బహుశా రేపు ఈ కమిటి తన నివేదికను సమర్పించే అవకాశం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : HRD Minister  Hyderabad Central University  Smruthi Irani  Rohit  ABVP  Bandaru Dattatreya  

Other Articles