Nandamuri Balakrishna meets CM KCR

Nandamuri balakrishna meets cm kcr

Nandamuri Balakrishna, CM KCR, KCR, Dictator, Basavatarakam Cancer Hospital

Nandamuri Balakrishna today met Telangana Chief Minister K Chandrasekhar Rao requesting him to grant Building Regularization Scheme for Basavatarakam Cancer Hospital in Hyderabad. Balakrishna is the chairperson of this famous hospital which was built on his mother Basavatarakam.

కేసీఆర్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ

Posted: 01/18/2016 04:18 PM IST
Nandamuri balakrishna meets cm kcr

హిందుపురం ఎమ్మెల్యే, టిడిపి నేత, నటుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్‌ను ఎమ్మె‌ల్యే బాలకృష్ణ మర్యాదపుర్వకంగానే కలిసినట్లు తెలుస్తోంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బాలకృష్ణ చైర్మెన్‌గా వ్యవహరిస్తుండటంతో ఆసుపత్రికి సంబంధించి రోగుల సౌకర్యార్థం కొన్ని నిర్మాణాలను ఆయన నిర్మించారు. వీటిని బీఆర్‌ఎస్ కింద క్రమబద్ధీకరించాలని కేసీఆర్‌ను బాలకృష్ణ కోరారు. దీనికి సంబధించి కేసీఆర్ ఉదారంగానే స్పందించారని సమాచారం.  ఇలాంటి విషయాల్లో మా సహాయం ఎప్పటికి ఉంటుందని కేసీఆర్ తెలిపినట్లు తెలుస్తోంది.

బసవతారకం అసుపత్రితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు  రోగులతో పాటు వచ్చే వారికి నైట్ షెల్టర్ భవనాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామి ఇచ్చారు. వీరి భేటీలో ఎన్టీ రామరావుతో కేసీఆర్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని ఇరువురు గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా డిక్టేటర్ సినిమా చూడాలని సీఎంను బాలయ్య కోరారు. డిక్టేటర్ చూసేందుకు కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం. ఇక వందో సినిమా ఎప్పుడు చేస్తున్నారని బాలయ్యను సీఎం అడిగారు. ఆదిత్య 369కు సీక్వెల్‌గా వందో సినిమా చేస్తున్నానని బాలయ్య తెలిపారు. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రిని బాలకృష్ణ కలవడం వార్తల్లో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  CM KCR  KCR  Dictator  Basavatarakam Cancer Hospital  

Other Articles