Dalit student commits suicide at Hyderabad University

Dalit student commits suicide at hyderabad university

Hyderabad University, Hyderabad central University, Dalit student commits suicide, Rohit, Hyderabad, Student suicide

In a tragic incident, a Dalit PhD scholar was found hanging at a central university's hostel room in Hyderabad. Rohit, a resident of Guntur, was pursuing his PhD in society studies for the past two years. He allegedly committed suicide on Sunday by hanging himself at the hostel. "V Rohit (around 26) was found hanging in the hostel room. He was among the five research scholars who were suspended by Hyderabad Central University (HCU) in August last year

ITEMVIDEOS: దళిత విద్యార్థి ఆత్మహత్యతో HCUలో ఉద్రిక్తత

Posted: 01/18/2016 11:23 AM IST
Dalit student commits suicide at hyderabad university

హైదరాబాద్ సెంట్రల్ యూనిర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యతో యూనివర్సిటీలో టెన్నన్ వాతావరణం నెలకొంది. పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న రోహిత్‌ మతోన్మాద రాజకీయాలకు బలయ్యాడు. నిరుపేద కుటుంబంలో జన్మించిన రోహిత్‌ స్వస్థలం గుంటూరు. క్యాంపస్‌లో దళిత, వామపక్ష ఉద్యమాల్లో యాక్టివ్‌గా రోహిత్‌ చాలాకాలంగా యాక్టివ్‌గా పాల్గొన్నాడు. వర్సిటీలోని విద్యార్థుల సమస్యలపై రోహిత్‌ క్రియాశీలకంగా వ్యవహరించాడు. హెచ్‌సీయూలోని ఏబీవీపీ నాయకుడు సుశీల్‌పై దాడి చేశారన్న కారణంతో సరిగ్గా 15 రోజుల క్రితం ఐదుగురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు

రోహిత్ ఆత్మహత్య మీద హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. దళిత వర్గాన్ని అణగదొక్కే ఉద్దేశంతో కొంత మంది కావాలనే కక్షసాధింపుకు దిగారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు. కాగా యూనివర్సిటీలో వాతావరణం ఎలా ఉందో అద్దంపడుతూ రోహిత్ తన సూసైడ్ లెటర్ లో వివరించారు. ‘‘ఈ యూనివర్సిటీలో మనిషిని మనిషిగా చూడటం లేదు. నా పుట్టుకను చూస్తున్నారు. కులం పేరుతో ఇంకా ఏన్నాళ్లు చూస్తారు. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. కొన్ని రోజులుగా నా మనసుకు శరీరానికి తీవ్ర ఘర్షణ జరుగుతోంది. నాపుట్టుక తప్పా.. లేక నేనా కులంలో పుట్టడం తప్పా..'' ఇవి రోహిత్‌ వేముల రాసిన చివరి మాటలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad central University  Dalit student commits suicide  Rohit  Hyderabad  

Other Articles