Ex Judge Prabhakar Rao Suspicious death

Ex judge prabhakar rao suspicious death

Prabhakar Rao, Gali Janardhan Reddy, Gali Janardhan Reddy Bail scam, Mining scam, Ex Judge Prabhakar Rao

Former Judge Prabhakar Rao found dead this morning. He was involved in bail scam of mining baron Gali Janardhan Reddy.

మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు అనుమానాస్పద మృతి

Posted: 01/18/2016 11:10 AM IST
Ex judge prabhakar rao suspicious death

తీవ్ర సంచలనం సృష్టించిన గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ స్కాంలో మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి అంశం మరోసారి తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ గనుల కోభంకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిల్ కోసం ఏకంగా న్యాయమూర్తినే ప్రలోభపెట్టడం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది. అయితే సిబిఐ దీని మీద విచారణ జరిపి న్యాయమూర్తి ప్రభాకర్ రావు మీద కేసు నమోదు చేసింది. అయితే ఇందులో తనను అక్రమంగా ఇరికించారని ప్రభాకర్ రావు వాదిస్తున్నారు. బెయిల్ మీద విడుదలైన ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదకరాబాద్ లోని ఈస్ట్ మారేడుపల్లిలోని తన ఇంటిలో మాజీ న్యాయమూర్తి ప్రభాకర్ రావు అనుమానాస్పదంగా మృతిచెందడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభాకర్ రావు ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే హత్య చేయబడ్డారా అన్న దాని మీద పోలీసులు విచారించి నిజాలను నిగ్గు తేల్చాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles