Rahul Gandhi: BJP not serious on GST, no proper framework in place

Rahul gandhi startups and intolerance can t go together

Rahul Gandhi, Rahul Gandhi on GST, Rahul at NMIMS, Rahul on start ups, Rahul on intolerence, Indian National Congress, Narsee Monjee Institute of Management Studies, Mumbai, Congress, Narendra Modi, PM Modi

Congress vice president Rahul Gandhi took on the BJP and RSS for what he termed as their "rigid thinking" which hampers creativity and start-ups in the country.

మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసుకున్న రాహుల్ గాంధీ

Posted: 01/17/2016 02:38 PM IST
Rahul gandhi startups and intolerance can t go together

మంత్రాలకు చింతకాయలు రాలవన్న విషయం కాంగ్రెస్ యువనేత, ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి.. ఎట్టకేలకు అర్థమైంది. పదేళ్ల అధికారంలో ఏనాడు సుదీర్ఘ ఉపన్యాసాలు, ప్రసంగాల జోలికి వెళ్లని రాహుల్.. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా అదే విధానాన్ని అవలంభిస్తున్నారు. అంతేకాదు అధికారంలో వున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కూడా ఆయన ఈ విషయాన్ని సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగాలతో ప్రజలను ప్రలోభపెట్టేందుకు యత్నిస్తున్నారని, అయితే మంత్రాలకు చింతకాయలు రాలవని, అదే విధంగా మోడీ ప్రసంగాలతో దేశంలోని రోడ్లు శుభ్రం కావని రాహుల్ ఎద్దేవా చేస్తున్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో బీజేపీ సర్కారుపై రాహుల్ గాంధీ పదునైన విమర్శలను గుప్పించారు. కేవలం ప్రసంగాలతోనే రోడ్లు శుభ్రం కావని ఆయన కాస్తంత ఘాటు విమర్శలే చేశారు. మోదీ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వంగానే ముందుకెళుతోందని ఆయన విమర్శించారు. మాటలతోనే పనికాదని కూడా ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ పేరిట మోదీ ఇచ్చిన పిలుపుతోనే రోడ్లు శుభ్రం కావని, ముంబైలోని రోడ్లపై ఇంకా టన్నుల కొద్దీ చెత్త కనిపిస్తుండటమే ఇందుకు నిదర్శనమని రాహుల్ గాంధీ అన్నారు. ఈ తరహా పాలనతో ప్రజల్లో బీజేపీ ప్రభుత్వం పట్ల నమ్మకం కరిగిపోతోందని కూడా ఆయన పేర్కొన్నారు.

స్టార్టప్, అసహనం రెండు కలసి సాగలేవని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దేశంలో స్టార్టప్ ల మంత్రాన్ని బీజేపీ సర్కారు పఠిస్తుంటే, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కఠిన వైఖరితో సాగుతోందని ఆయన ఆరోపించారు. అసహన విధానాలను పెంచిపోషిస్తుందని విమర్శించారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఇవాళ నగరంలోని జుహూ-విలేపార్లే పరిధిలోని ‘నర్సీ మాంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్’ విద్యార్థులతో భేటీ అయ్యారు.

బీజేపీ ద్వంద్వ వైఖరితో పాలన సాగిస్తోందని రాహుల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. స్టార్టప్, అసహనం... రెండూ చేతులు కలిపి ముందుకు పయనించలేవని ఆయన తేల్చిచెప్పారు. స్వేచ్ఛ ఉన్నప్పుడే స్టార్టప్ లు వృద్ధి చెందుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక బీజేపీ సర్కారు దేశ ప్రజలను వర్గాలు చీలుస్తోందని విమర్శించారు. దేశ ప్రజలను బీజేపీ సర్కారు హిందువులు, ముస్లింలు అంటూ విభజిస్తోందని దుయ్యబట్టారు.

అయితే తాము మాత్రం దేశ ప్రజల మధ్య విభజన రేఖలను గీయడం లేదన్నారు. ఇదే తమకూ, బీజేపీకి ఉన్న తేడా అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఓ విద్యార్థి జనరల్ సేల్స్ టాక్స్ (జీఎస్టీ)పై రాహుల్ ను ప్రశ్నించగ, ప్రజలపై అధిక భారం పడకూడదనే తాము జీఎస్టీ బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదని చెప్పారు. జీఎస్టీ బిల్లుతో ప్రజలపై రెండు నుంచి రెండున్నర శాతం మేర అధిక భారం పడుతుందని రాహుల్ చెప్పారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల అకాశాన్ని అంటుతున్న తరుణంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలపై భారం మోపడం తమకు ఇష్టంలేదన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  intolerance  GST  NMiMS  start ups  RSS  

Other Articles