uttrakhand brave girl teaches lesson to eve teaser

Uttrakhand girl humiliates eve teaser

brave girl lesson to eve teaser, feisty girl lesson to eve teaser, uttrakhand lesson to eve teaser, eve teaser humiliated, eve teaser humiliated in uttrakhand, girl punishes eve teaser, Uttrakhand girl punishes eve teaser, Rudrapur brave girl punisehes eve teaser,

When crimes against women continue to take place everyday across the country a feisty girl in Uttrakhand's Rudrapur area publicly taught a person who was harassing her.

ITEMVIDEOS: ఈవ్ టీజర్ కు నట్టనడివీధిలో గుణపాఠం చెప్పిన యువతి..

Posted: 01/17/2016 02:40 PM IST
Uttrakhand girl humiliates eve teaser

నిజంగా ఈ దేశానికి ఏం అయ్యింది. తన తోబుట్టువు, తల్లిని, సతిని ఎవరైనా ఏమైనా అంటే సహించని మగవాడు.. ఇతర వనితల పట్ల మాత్రం కామెంట్లు చేస్తూ.. ఈవ్ టీజింగ్ కు పాల్పడుతుంటాడు. ఈ తరహా ఘటనలు దేశంలో అనునిత్యం ఏదో ఒక మూల చోటుచేసుకుంటూనే వున్నాయి. పరస్త్రీలను కన్నెత్తి చూడకూడదన్న మన భారతీయ హైందవ సంప్రదాయాన్ని కూడా గంగలో కలుపుతూ.. పాశ్చాత్య మోజులో తానెం చేస్తున్నాడో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నాడు.


ఇలాంటి చర్యలకే నిత్యం పాల్పడుతున్న ఓ పోకిరికీ నట్టనడి వీధులో బుద్ది చెప్పింది ఉత్తరాఖండ్ కు చెందిన ఓ యువతి. పోకిరీనీ కాలర్ పట్టుకుని నడిరోడ్డులోకి ఈడ్చుకోచ్చి మరీ చెప్పు దెబ్బలను కోట్టింది. తాను వస్తున్న రోడ్డులో నిత్యం మాటు వేసి తనను అసభ్య పదజాలంతో ధూషింస్తున్నాడని, అయితే అతని విషయాన్ని లైట్ గా తీసుకోవడంతో.. తాన రాకను గమనించి తనపై రాళ్లను విసరడం ప్రారంభించాడని యువతి తెలిపింది. పోకిరీ చర్యలతో తనలోని సహనం నశించి.. ఇవాళ అతన్ని పట్టుకుని దేహశుధ్ది చేశానని చెప్పింది.

ఇవాళ కూడా తాను రావడాన్ని గమనించి చిన్న చిన్న రాళ్లను విసరడంతో పాటు అసభ్యపదజాలంతో కామెంట్లు చేశాడని, సహనం నశించిన తాను బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గుమ్మిగూడారని వారి సాయంతో తాను అతనికి గుణపాఠం చెప్పానని ఉత్తరాఖండ్ రుద్రంపూర్ ప్రాంతానికి చెందిన యువతి తెలిపింది. అయితే పోకిరీకి గుణపాఠం చెప్పిన యువతిని స్థానికులు ప్రశంసిస్తున్నారు. పోకిరీల బెడదను ఎదుర్కోంటున్న యువతులందరూ ఇలా ధైర్యంగా వ్యవహరిస్తే.. ఈవ్ టీజర్లలో కూడా మార్పు వస్తుందని అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : brave girl  eve teaser  uttrakhand  rudrampur  lesson  

Other Articles