allan border questions australias decision to rest mitchell marsh

Border surprised by selectors decision to rest marsh

Australia vs India 2016, Australian Cricket, Cricket Australia, allan border, India, Team India, Brad Haddin, John Hastings, Mitchell Marsh, MS Dhoni, Rohit sharma, Cricket

Marsh was replaced by John Hastings, who is currently Melbourne Stars' leading wicket-taker in the 2015/16 BBL with 8 wickets

క్రికెట్ అస్ట్రేలియాపై ప్రశ్నల వర్షం కురిపించిన మాజీలు..

Posted: 01/14/2016 05:22 PM IST
Border surprised by selectors decision to rest marsh

టీమిండియాతో ఐదు వన్డేల సిరీస్ లో  తొలి వన్డేలో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్ ను రెండో వన్డేకు విశ్రాంతి నివ్వడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తొలి వన్డేకు ముందుగానే అతని స్థానంలో జాన్ హేస్టింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించడాన్ని ఆ దేశ మాజీ క్రికెట్ కెప్టెన్ అలెన్ బోర్డర్ ప్రశ్నించాడు. అసలు అంత ఆకస్మికంగా ఒక ఆటగాడ్ని పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించాడు. ఇది సరైన విధానం కాదని బోర్డర్ స్పష్టం చేశాడు.

మరోవైపు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన వికెట్ కీపర్ బ్రాడ్ హడిన్ కూడా  సీఏ వ్యవహరశైలిని తప్పుబట్టాడు. ఒక మంచి ఆల్ రౌండర్ కు ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా పదే పదే తప్పించడం మంచిది కాదన్నాడు. అతను ఆడిన దానికంటే రిజర్వ్ బెంచ్ కే పరిమితమైందే ఎక్కువగా కనబడుతుందన్నాడు. ఇలా చేస్తే ఆటగాడిపై ఒత్తిడి పెరుగుతుందని హడిన్ పేర్కొన్నాడు. ఈ  పరిస్థితుల్లో ఒక ఆటగాడు తనకు తాను నిరూపించుకోవడంలో విఫలం అవుతూ ఉంటాడని తెలిపాడు. మార్ష్  బ్యాట్ తో నిరూపించుకోవడానికి అతనికి సరైన అవకాశాలు లభించడం లేదని హడిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఆసీస్ ఆటగాళ్ల రోటేషన్ పద్దతిలో భాగంగా మిచెల్ మార్ష్ స్థానంలో జాన్ హేస్టింగ్ ను రెండో వన్డేకు తీసుకుంటున్నట్లు ఆసీస్ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket australia  india  allan border  Mitchell Marsh  

Other Articles