Two wives? You won't qualify as an Urdu teacher in UP

Men with two wives declared ineligible for urdu teacher s post in up

UP, Uttar Pradesh, India, Akhilesh Yadav, urdu teachers, notification, two wives, controversy, Akhilesh Yadav government, UP government schools, assistant Urdu teachers

Akhilesh Yadav government has declared men having more than one wife will not be eligible for the post of assistant Urdu teachers in UP government schools.

ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుళ్లకు సర్కారీ కొలువు హుళ్లక్కే..!

Posted: 01/13/2016 07:15 PM IST
Men with two wives declared ineligible for urdu teacher s post in up

ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుళ్లకు సర్కారీ కొలువు ఆశలుంటే వాటిని తుడిచేయాల్సిందే. ఇకపై ఇద్దరు సతులున్న పతులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావుగాక రావు. ఎందుకంటే ప్రభుత్వం ఇద్దరు భార్యలున్న భర్తలను ఈ కొలువులకు ఎంపిక చేయవద్దని నోటిఫికేషన్ జారీ చేసింది. నమ్మశక్యంగా లేదా..? అయితే అది దేశవ్యాప్తంగా మాత్రం కాదండీ.. మరెక్కడంటారా..? ప్రస్తుతానికి ఉత్తర్ ప్రదేశ్ లో ఈ నిబంధన అమలులోకి రాగా, మున్ముందు ఎ ఏ రాష్ట్రాలు దీనిని అనుసరిస్తాయో వేచి చూడాల్సిందే. అయితే ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది.

ఉర్దూ ఉపాధ్యాయుల భర్తీ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ లో ఇద్దరు భార్యలను కలిగివున్న వారు ఈ పోస్టులకు అనర్హులని పేర్కొనింది. దీంతో ముస్లిం సంఘాలు దీనిని పెద్ద ఎత్తున నిరసిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 3,500 ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో జీవించి ఉన్న ఇద్దరు భార్యలను కలిగివున్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అనర్హులని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇద్దరు భార్యలున్న భర్తకు  భార్యగా ఉంటే...ఆ  మహిళా అభ్యర్థులను సైతం అనర్హులుగా ప్రకటించారు.

దీనిపై విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ.. వితంతువులకు పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా తలెత్తే సమస్యలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కేవలం ఉర్దూ ఉపాద్యాయుల నియామకంలోనే కాకుండా మిగతా పోస్టుల భర్తీలో సైతం ఇదే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ముస్లిం వర్గాలు మాత్రం.. తమ మత చట్టాల ప్రకారం నలుగురిని పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని... ఎప్పుడో పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా ఇబ్బందులు తలెత్తుతాయనే నెపంతో ఇప్పుడు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నాయి. అయినా పెన్షన్ను ఇద్దరికీ సమానంగా పంచితే సరిపోతుందని, ఈ నిర్ణయం తమ పట్ల వివక్ష చూపించడమే అంటున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttar pradesh  urdu teachers  notification  two wives  controversy  

Other Articles