Beggers english is super and he got job

Beggers english is super and he got job

Begger, Pakistan, Lahore, Social Media

An Educated Homeless Man Who Speaking Awesome English, how an old man of 57 years Speaking Awesome English and telling the story of his life, Watch this video. You Have Ever seen.

ITEMVIDEOS: భిక్షగాడి ఇంగ్లీష్ అదిరింది.. ఉద్యోగం వచ్చింది

Posted: 01/13/2016 11:22 AM IST
Beggers english is super and he got job

సోషల్ మీడియా అంటే ఓ వ్యసనంగా మారింది. తిండి లేకున్నా ఫరవాలేదు కానీ సోషల్ మీడియాలొ లేకుండా మాత్రం ఎవరూ ఉండలేని పరిస్థితి. సోషల్ మీడియాకు చాలా మంది అడిక్ట్ అయిపోయిన పరిస్థితి. అయితే సోషల్ మీడియా నుండి లాభాల కన్నా నష్టాలు ఎక్కువ అని చాలా మంది విమర్శిస్తుంటారు. కానీ అదే సోషల్ మీడియా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఘటనలు ఎన్నొ ఉన్నాయి. తాజాగా లాహోర్ కు చెందిన ఓ వ్యక్తి వీడియో అతన్ని ఓ ఉద్యోగిని చేసింది. ఇంతకీ ఏంటా మ్యాటర్ అనుకుంటున్నారా..? అయితే అతడు ఎవరు..? సోషల్ మీడియాలో అతడు ఎలా పాపులర్ అయ్యాడు..? అతడికి ఉద్యోగం ఎలా వచ్చింది..? అన్న విషయాలు తెలియాలంటే మొత్తం స్టోరీ చదవండి.

పాక్ నటుడు అహసాన్ ఖాన్‌కి కరాచీ డిఫెన్స్ మార్కెట్‌లో ఓ యాభై ఆరేళ్ల వృద్ధ భిక్షాగాడు తగిలాడు. ‘డబ్బులొద్దు... ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించండి’ అని ఆ వృద్ధ్ధుడు ఇంగ్లీష్‌లో అడిగేసరికి ఖాన్ ఆశ్చర్యపోయాడు. అసలు భిక్షగాడు ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటి..? అది కూడా డబ్బులు వద్దు.. ఉద్యోగం ఇప్పించండి అని అడగటం ఏంటి అని అవాక్కయ్యాడు. అయితే అతడు ఒకప్పుడు బాగా బ్రతికి ఇప్పుడు చెడిన వ్యక్తి. అతడి కారును.. రెండు డంపర్లు ముందు నుంచి, వెనక నుంచి ఢీకొట్టి నుజ్జు నుజ్జు చేశాయి. ఈ ప్రమాదంలో భార్య, ఏడుగురు  పిల్లలు చనిపోయారు. ఇతను ఆస్పత్రిలో ఉండగా అన్నదమ్ములు ఆస్తిని దోచేసి, గెంటేశారు. కోట్ల ఆస్తి ఉన్న అతను బిచ్చగాడై కరాచీ వీధుల్లోకి చేరుకున్నాడు. అహసాన్ అతని వీడియోను తన ఫేస్ బుక్‌లో పోస్టు చేశాడు. వేలాది మంది నెటిజన్లు స్పందించారు. ఆమ్ టెక్ సిస్టమ్స్ అనే కంప్యూటర్ సంస్థ అయితే అతనికి ఉద్యోగమూ, క్వార్టర్స్ ఇచ్చింది. సోషల్ మీడియా పుణ్యమా అని అతడు ఇప్పడు ఓ ఉద్యోగాన్ని, ఉండడానికి ఇళ్లు పొందాడు. ఇలా ఒక్కరిద్దకి కాదు చాలా మందికి సోషల్ మీడియా జీవితాలనిచ్చింది. అందుకే మరి సోషల్ మీడియా జిందాబాద్
 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Begger  Pakistan  Lahore  Social Media  

Other Articles