Is it Pawan Kalyan's fault to ask his own remuneration

Is it pawan kalyans fault to ask his own remuneration

Pawan Kalyan, Pawan kalyan complaint on BVSN Prasad, Actor Pawan kalyan on Producer BVSN PrasadActor Pawan kalyan action on BVSN PrasadAttarintiki daredi, Attarintiki daredi cinema, Pawan kalyans Attarintiki daredi, Attarintiki daredi contraversy, Attarintiki daredi Prasad, Power Star Pawan Kalyan

That range of high quality charactered Pawan Kalyan, is now being strict on his pending remuneration from ‘Attharintiki Daredi’ movie producer, BVSN Prasad. What is the exact reason behind it?

ఎగ్గొట్టిన డబ్బులు అడగటం పవన్ తప్పా..?

Posted: 01/13/2016 01:29 PM IST
Is it pawan kalyans fault to ask his own remuneration

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఇది పేరు కాదు ఓ పవర్. ఎంతో మంది అభిమానుల గుండె చప్పుడు. ఎంతో మంది భవిష్యత్ ఆశా కిరణం. సినిమా స్టార్ గానే కాకుండా మానవతా దృక్పథం ఉన్న వ్యక్తిగా కూడా పవన్ కళ్యాణ్ కు గుర్తింపు ఉంది. పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనుల గురించి వేనోళ్ల పొగిడే వారు చాలా మంది ఉన్నారు. ఆయన ఎవరికైనా మంచే చేస్తారు తప్పితే.. తెలియకుండా కూడా హాని కానీ, తప్పు కానీ  చేసే మనిషి కాదు. అలాంటి మహోన్నత వ్యక్తి మీద తాజాగా కొంత మంది పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారు. అత్తారింటికి దారేది సినిమా నిర్మాత ప్రసాద్ తనకు బాకీ ఉన్న రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని పవన్ కళ్యాణ్ ‘మా’లో ఫిర్యాదు చెయ్యడం మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు నిజాలు ఏంటి..? నిజాలను వెలుగులోకి తీసుకువస్తూ.. పూర్తి వివరాలు మీ కోసం..

Also Read: సంక్రాంతి కానుకగా ‘రత్తన్ పూర్ కా సర్దార్’ టీజర్

అత్తారింటికి దారేది సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంచనానికి కారణమైంది. సినిమా విడుదలకు ముందే పైరసీ కాటు వేసింది. మొత్తం సినిమా నెట్ లో దర్శనమివ్వడంతో నిర్మాత, సినిమా యూనిట్ మొత్తం షాక్ కు గురయ్యారు. అయితే అలాంటి టైంలో పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ తమ రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చేశారు. అలా సినిమా విడుదలకు తమ వంతు సహాయం చేశారు. బివిఎస్ఎన్ ప్రసాద్ కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెన్నంటి ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాత డబ్బులు ఇస్తే కానీ షూటింగ్ కు రాని పరిస్థితి ఉంది. కానీ పవన్ మాత్రం తన సినిమా నిర్మాతను నిర్మాతగా కాకుండా ఇంటి మనిషిలా చూశాడు.

Also Read: పవన్ కళ్యాణ్... జనసేనకు ఏ గుర్తు కావాలి..?

అత్తారిందికి దారేది సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత ప్రసాద్ పవన్ తనను ఇంటి మనిషిగా చూశారని వెల్లడించారు. కన్న తండ్రిని చూసినట్లు పవన్ తనను చూసుకున్నారని ప్రసాద్ మీడియా ముఖంగా వెల్లడించారు. మరి అలాంటి వ్యక్తి రెమ్యునరేషన్ విషయంలో ఎందుకు ఇలా చేస్తారు అని ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ కు డబ్బుల మీద ఎన్నడూ వ్యామోహం లేదు అని అందరికి తెలుసు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా కానీ వెంటనే స్పందించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ ది. హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు తన వంతుగా అప్పటికప్పుడు 50 లక్షల రూపాయలు సహాయం చేశాడు. అలాగే చెన్నైలో వరద సంభవిస్తే 2 కోట్ల రూపాయలను డొనేట్ చేశాడు. మరి ఇలా కష్టం వస్తే ఆదుకోవడానికి పవన్ ఎప్పుడూ సిద్దంగా ఉంటారు.

Also Read: "పవనిజం" చాటిన "సర్దార్" 

తన నిర్మాత కష్టాల్లో ఉన్నా.. తాను కష్టాల్లో ఉన్నట్లే అని పవన్ భావించారు కనుకనే అత్తారింటికి దారేది సినిమా చేసినా కానీ రెమ్యునరేషన్ తీసుకోలేదు. అయితే సినిమా హిట్ అయిన తర్వాత ఇస్తానన్న డబ్బుల మీద ప్రసాద్ మాత్రం వాయిదాల మీద వాయిదా వేస్తూనే ఉన్నారు. అందుకే పవన్ మా ను ఆశ్రయించాల్సి వచ్చింది.  హీరో, స్టార్ పవన్ కళ్యాణ్ మహానటుడు... అంత కన్నా గొప్ప వ్యక్తి అని ప్రెస్ మీట్ లో ఎంతో ఉద్విగ్నంగా మాట్లాడిన ప్రసాద్ మరి పవన్ కళ్యాణ్ కు ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అన్నది ప్రశ్న. అత్తారింటికి దారేది సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ ఆదుకున్నారు... సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. కానీ పవన్ కు మాత్రం బాకీ చెల్లిద్దామని ప్రసాద్ కు అనిపించలేదు.

Also Read: ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’పై పవర్ స్టార్ ఎటాక్

 

అయితే ప్రసాద్. పవన్ కళ్యాణ్ అంశం మీద కొన్ని చానల్స్, పత్రికలు, వెబ్ సైట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నత వ్యక్తి మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.

* పవన్ తనకు రావాల్సిన డబ్బులను అడగడం తప్పా..?
*అత్తారింటికి దారేది సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నిర్మాతకు అండగా నిలబడటం నిజం కాదా..?
* సినిమా రిలీజ్ అయిన తర్వాత రికార్డ్ స్థాయిలో కలెక్షన్ లు చేసినా తిరిగి డబ్బులు చెల్లించకపోవడం కరెక్టేనా.?
* సినిమా విడుదలై మూడు సంవత్సరాలు గడుస్తున్నా కానీ బాకీ చెల్లించకపోవడం ప్రసాద్ కు సబబేనా..?
* ఆర్టిస్టుల కష్టార్జితాన్ని నిర్మాతలు ఇలా వెనకేసుకోవడం కరెక్టేనా..?
* సినిమా కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన పవన్ మీద ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలు అభాండాలు, అబద్దాలు రాయడం కరెక్టేనా..?

మరి నిజాలు తెలుసుకోకుండా కొన్ని ఛానల్స్ మాత్రం ప్రసాద్ చాలా మంచివాడు.. ఓ భారీ సినిమా రిలీజ్ కు ముందు పవన్ ఇలా కష్టపెట్టడం తప్పు కదా అని రాస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు వెల్లడించిన విషయం ఒకటి వాళ్లకు గుర్తుకులేదు. కళామతల్లి ఒడిలో అందరూ బాగుపడాలి... అందరూ బాగుండాలి అన్న పవన్ మాట వారికి ఎందుకు గుర్తుకు రావడం లేదు. చివరిగా ఒక మాట.. చివరగా ఒక్క మాట పవన్ కళ్యాణ్ కు ఎవరూ పోటీలేరు.. పోటీ రారు. ఎందుకంటే తనకు తానే పోటీ. పవన్ కళ్యాణ్ గురించి తెలియని కొంత మంది మాత్రం నింగి మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు.
జై హింద్

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Pawan Kalyan  pending remuneration  Attharintiki Daredi  BVSN Prasad  

Other Articles