Supreme Court stays Centres notification allowing Jallikattu

Supreme court stays centres notification allowing jallikattu

Jallikattu, Supreme court, central govt on jallikattu, Tamilnadu

The Supreme Court today stayed the Centre's notification lifting ban on controversial bull taming sport Jallikattu during the festival of Pongal in Tamil Nadu."As an interim measure, we direct that there shall be stay of notification dated January 7, 2016 issued by Ministry of Environment and Forest (MoEF)," a bench comprising justices Dipak Misra and N V Ramana said.

జల్లికట్టు మీద స్టే విధించిన సుప్రీంకోర్ట్

Posted: 01/12/2016 04:18 PM IST
Supreme court stays centres notification allowing jallikattu

తమిళనాడులో వివాదాస్పద జల్లికట్టు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే రానున్న ఎన్నికల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా మరో సారి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మీద స్పందించింది. కేంద్రం జల్లికట్టు ఆడేందుకు ఇచ్చిన అనుమతుల మీద స్టే విధిస్తూ సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ రోజున నిర్వహించే జల్లికట్టుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జల్లికట్టు నిర్వహణకు కేంద్రం ఇచ్చిన అనుమతులపై కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జల్లికట్టుపై కేంద్రం అనుమతులు నిలిపివేయాలని జంతు సంరక్షణ బోర్డు, పెటా సంస్థలు నిన్న పిటిషన్ దాఖలు చేశాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఠాకూర్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించి  ఇవాళ విచారణ చేపట్టింది. 2014లో సుప్రీం తీర్పునకు కేంద్రం నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని పిటిషన్‌లో తెలిపింది. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని జల్లికట్టు అతిక్రమిస్తుందని పిటిషనర్లు వాదించారు. అయితే జల్లికట్టు ఎంతో కాలంగా సంప్రదాయంగా కొనసాగుతోందని తమిళులు వాదిస్తున్నారు. కానీ మరోసారి కేంద్రం అనుమతినిస్తూ తీసుకున్న నిర్ణయంతో జల్లికట్టు వివాదం తెర మీదకు వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jallikattu  Supreme court  central govt on jallikattu  Tamilnadu  

Other Articles