UP girl attacks boyfriend with acid after he declines marriage proposal

Up girl attacks boyfriend with acid after he declines marriage proposal

Acid Attack, UP, Girl attacked with acid, Uttarpradesh, Girl acid attack

In a role reversal of sorts, a 19-year-old girl angry at her boyfriend, 21, rejecting her proposal for marriage called him home and burnt his face with acid. The incident, which happened in Bijnor on Sunday night, has shocked both police and neighbours of the estranged couple alike.

పెళ్లి వద్దన్నాడని ప్రియురాలి యాసిడ్ దాడి

Posted: 01/12/2016 04:25 PM IST
Up girl attacks boyfriend with acid after he declines marriage proposal

నిన్నటి దాకా ప్రియురాలి మీద  లేదంటే ప్రేమించలేదని అమ్మాయిల మీద అబ్బాయిల దాడి, యాసిడ్ దాడి అని వార్తలు చదివారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఎంతలా అంటే అబ్బాయిల మీద అమ్మాయిలు కూడా యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. యూపీలోని బిజ్నూర్‌ కు చెందిన ఆఫ్రీన్, సూరజ్‌కుమార్ గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకుందామని యువతి యువకుడిని ఎన్నో పార్లు అడిగింది కానీ యువకుడు మాత్రం నిరాకరించాడు. యువతి ముస్లిం.. యువకుడు హిందూ కుటుంబానికి చెందినవాడు. ఈ క్రమంలో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.

ఈ క్రమంలో అమ్మాయి తన పుట్టినరోజు అని యువతి యువకుడిని తన ఇంటికి పిలిపించింది. బర్త్‌డే పార్టీ అయిపోయాక అందరూ కలిసి భోజనం చేశారు. ఇక ఇంటికెళ్లిన తర్వాత యువతి తనకు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. మళ్లీ యువతి ఇంటికి వచ్చాడు యువకుడు.  అలా వచ్చిన యువకుడి ముఖంపై యువతి యాసిడ్ దాడి చేసింది. తనతో వచ్చిన స్నేహితుడు అర్జున్ కుమార్ చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించాడు. అయినా అమ్మాయిలు కూడా యాసిడ్ దాడులకు దిగితే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Acid Attack  UP  Girl attacked with acid  Uttarpradesh  Girl acid attack  

Other Articles