CCTV captures a woman beating her mother in law mercilessly

Cctv captures a woman beating her mother in law mercilessly

Bijnor, Uttar Pradesh, sangeetaDevi, woman beating her mother in law

A woman in Bijnor, Uttar Pradesh has been arrested on charges of attempt to murder after a shocking video, uploaded by a social activist went viral on Monday, which showed her brutally beating up and torturing her elderly mother-in-law.

ITEMVIDEOS: అత్తను చావబాదిన కోడలు.. సిసిటివిలో రికార్డ్

Posted: 01/12/2016 09:42 AM IST
Cctv captures a woman beating her mother in law mercilessly

అత్తంటే అమ్మ.. కోడలు అంటే కూతురు. కానీ మన దగ్గర మాత్రం అత్తా కోడళ్లు అంటే బద్ద శత్రవులు. ఎంతలా అంటే ఒకరిని ఒకరు చంపేసుకునేంత కసి. సినిమాల్లో చూపించినట్లు కోడలిని అత్త రాచిరంపాన పెట్టడం.. కోడలు అత్తకు సమాధానం చెప్పడం ఇదంతా అందరికి తెలుసు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లో ఓ ఉత్తమ కోడలు మాత్రం తన పైశాబికాన్ని చూపించింది. పాపం వయసు మళ్లిన ఆడిన అని కూడా చూడలేదు. అత్త మీద కోడలి వీర ప్రతాపం మొత్తం సిసిటివి పుటేజుల్లో రికార్డు కావడం.. అవి కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండటంతో దీని మీద తీవ్ర చర్చ సాగుతోంది.

ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ కు చెందిన సంగీతా దేవీ అనే ఓ కోడలు వృద్ధాప్యంలోని తన అత్తపై వీర ప్రతాపం చూపింది. మంచంపై నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న తన అత్తను హతమార్చేందుకూ యత్నించింది. వాటర్ హీటర్, రాడ్డు, రాయి.. చేతికి ఏది అందితే, దానితో విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డా, ప్రాణాలతో బయటపడిన తన తల్లిని సంగీతా దేవీ భర్త ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నాడు. తన తల్లితో భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆ కొడుకు తల్లి గదిలో సీసీకెమెరా ఏర్పాటు చేశాడు. దీనిని గమనించని సంగీత తన అత్తపై ఈ నెల 5న వీరవిహారం చేసింది. తల్లిని ఆసుపత్రికి తరలించిన కొడుకు సీసీకెమెరాలో రికార్డైన తన భార్య ప్రతాపం దృశ్యాల వీడియోను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వీడియోను చూసిన పోలీసులు సంగీతాదేవిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయినా ఇలాంటి కోడళ్లు రేపటి అత్తలు అన్న విషయాన్ని మరిచిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bijnor  Uttar Pradesh  sangeetaDevi  woman beating her mother in law  

Other Articles