Stir Between TRS And Congress Corporators In Municipal Corporation Body Meet

Stir between trs and congress corporators in municipal corporation body meet

Karimnagar, TRS, Karimnagar Muncipal corporation

Stir Between TRS And Congress Corporators In Municipal Corporation Body Meet

ITEMVIDEOS: సమావేశంలో చెప్పు చూపించిన కార్పోరేటర్

Posted: 01/11/2016 07:28 PM IST
Stir between trs and congress corporators in municipal corporation body meet

కరీంనగర్‌ నగరపాలక సంస్థ సమావేశంలో టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు చెప్పులు చూపించుకుంటూ దుర్బాషలాడుకున్నారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం ఉదయం నుంచి జరుగుతోంది. ఈ సమావేశంలో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్ల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకుంది. 22వ డివిజన్‌కు చెందిన తాటి ప్రభావతి తన డివిజన్‌లో... 4వ డివిజన్‌కు చెందిన ఎడ్ల సరిత జోక్యం చేసుకుంటోందని ఆరోపణలు చేయడంతో ఇరువురి మధ్య గొడవ ప్రారంభమైంది.

సుశీల అనే మహిళ ఇల్లు కట్టుకోడానికి పరిమిషన్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా... ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుందని సరిత ఆరోపించింది. దీంతో ప్రభావతి మండిపడుతూ తన డివిజన్‌లో జోక్యం చేసుకోడానికి నీవు ఎవరవంటూ చెప్పు చూపించింది. దీంతో సరిత కూడా అదే స్థాయిలో స్పందించింది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయం సరిత తన భర్తకు ఫోన్ ద్వారా చెప్పింది. ఆయన రావడంతో పరిస్థితి మరింత విషమించింది. ఈ నేపథ్యంలో చైర్మన్ రవీంద్రసింగ్‌ కల్పించుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. దీంతో సమావేశం మధ్యలోనే కార్పొరేటర్లు వెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karimnagar  TRS  Karimnagar Muncipal corporation  

Other Articles