Congress divided over Manish Tewari's 2012 troop movement claim

Congress divided over manish tewari s 2012 troop movement claim

manish tiwari, Congress, Army, Indian Army

Former Union Minister Manish Tewari has raked up the 2012 troop movement controversy, saying a media report about army units moving towards Delhi without notifying the then UPA government was "unfortunate but true" even as his own party distanced itself from his claims while former Army Chief V K Singh rubbished the remarks. Reacting to his remark, VK Singh said, Tewari should be told to read his book which talks about the issue.

ITEMVIDEOS: భారత్ లో సైనిక తిరుగుబాటు..!

Posted: 01/10/2016 07:17 PM IST
Congress divided over manish tewari s 2012 troop movement claim

పూర్తి ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో సైనిక తిరుగుబాటుకు ప్రయత్నాలు జరిగాయా..? సైనిక పాలనకు సైన్యం కదులుతోందా అన్న కొత్త అనుమానాలకు తెర తీశారు కాంగ్రెస్ సీనియర్ నేత మనీశ్ తివారి. పక్కదేశంలోగా మన దగ్గర కూడా సైన్యం అధికారం కోసం గతంలో ప్రయత్నాలు చేసిందా అన్న అనుమానాలు తావిచ్చేలా మనీష్ తివారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే మనీష్ తివారి చేసిన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ నేతలు సైతం మండిపడుతున్నారు. ఆయన మాటలకు తమ పార్టీకి ఎలాంటి సంబందం లేదని అంటున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా..?

మూడేళ్ల క్రితం 2012లో భారత సైన్యం హర్యానా నుంచి ఢిల్లీ వైపు అనుమానాస్పద స్థితిలో కదిలిందని మనీష్‌ తివారీ అన్నారు. సైన్యం ఢిల్లీ వైపు రావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం భయపడిందని చెప్పారు. సైన్యం తిరుగుబాటుకు ప్రయత్నించిందంటూ పరోక్షంగా ఆయన ఆరోపించారు. అప్పట్లో డిఫెన్స్ స్టాండింగ్‌ కమిటీలో తాను సభ్యుడినని, ఆ విషయం తనకు తెలిసిందని తివారీ చెప్పారు. తివారీ వ్యాఖ్యలు రాజకీయ ధుమారం రేపాయి. కాంగ్రెస్‌ పార్టీ సయితం ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఆయన పార్టీ అధికార ప్రతినిధి కారంటూ అధిష్టానం ప్రకటించింది. మనీష్‌ తివారీకి ఏ పని లేదని అందుకే అలా మాట్లాడుతున్నారని వీకే సింగ్‌ అన్నారు. సైన్యంపై ఒక పుస్తకం రాశారని, దాన్ని తివారీ చదవాలంటూ ఆయన సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manish tiwari  Congress  Army  Indian Army  

Other Articles