chandrababu Naidu Lures Investors

Chandrababu naidu lures investors

Chandrababu, chandrababu Naidu, Industries, Investments

Inviting domestic and foreign investors Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu today said the state authorities will provide all clearances and approvals in a short time and in a transparent manner.Speaking at the inauguration of CII's Partnership Summit in Visakhapatnam, he said the state has all the important elements such as skilled labour, power, land, water and natural resources.

పెట్టుబడులు పెట్టండి బాబు

Posted: 01/10/2016 09:01 PM IST
Chandrababu naidu lures investors

ఏపీలో పరిశ్రమలకు అనుమతి ఇచ్చేందుకు సింగిల్ డెస్క్ ఏర్పాటు చేస్తామని, ఇక పరిశ్రమలకు 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం కాగలదన్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పెట్టుబడుల సమావేశం ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో రెండు లక్షలకోట్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముందంజ వేస్తున్నామన్నారు. 2029 నాటికి దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉంటుందన్నారు చంద్రబాబు. వృద్ధిరేటులో దేశంతోనే పోటీ పడుతున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని అరుణ్ జైట్లీ ప్రశంసించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయన్నారు. విశాఖ జిల్లాలో 5 వేల కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు అనిల్ అంబానీ తెలిపారు. ప్రదాని మోదీని ‘మిషన్ ఇంపాజిబుల్’ గా అభివర్ణించారు. హైదరాబాద్ లో బిజినెస్ స్కూల్ ఖ్యాతికి చంద్రబాబే కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఐటీ, పోర్టులు, గనులు, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక పార్కులు తదితర రంగాల్లో ఆసక్తి చూపిన సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనున్నది. ఈ సదస్సులో దాదాపు 2 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు ఖరారు కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu  chandrababu Naidu  Industries  Investments  

Other Articles