I opened my eye on that time

I opened my eye on that time

fact, Realisation, Life, Incidents

Many of us dont know the values of relations and values. But every body will realise, That time every one belives on that.

నాకు కనువిప్పు కలిగిన వేళ

Posted: 01/09/2016 06:01 PM IST
I opened my eye on that time

"ఛి ఛి ... ఎక్కడ చూడు, గతుకుల రోడ్లు, చెత్తా చెదారం... బుర్రలు ఎక్కడో పెట్టుకుని డ్రైవ్ చేసే మనుషులు... గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు రోడ్ క్రాస్ చేసే శాల్తీలు... పక్కనోడి లైఫ్ మీదే ఇంటరెస్ట్ చూబించే ఇరుగు పొరుగు ... రోడ్ల్ మీదా , మనుషుల్లో నాటుకుపోయిన పొల్యూషన్... ఎప్పటికీ పూర్తవ్వని ప్రభుత్వం పనులు... ఏముంది ఇక్కడ? అనుబంధాల పేరిట కట్టడి... ఖర్చుల పేరిట మరింత సంపాదన కోసం పరుగెత్తడం... సాంప్రదాయాల పేరిట వెట్టి చాకిరీ చెయ్యడం... ఇదా లైఫ్? మనకోసం బతకని వారి గురించి బతకడం కన్నా వెర్రితనం ఇంకోటి ఉంటుందా?

అదే విదేశాల్లో చూడు ... మన లైఫ్ మనది... యెంత సంపాదనో, అంత ఎంజాయ్మెంట్... మనమేం చేసినా, పట్టించుకునే వాడు, అడిగేవాడే ఉండడు ... క్లీన్ రోడ్స్, బ్రాడ్ మైండ్స్... ఎవ్వరి గురించి ఎవ్వరూ పట్టించుకోరు... విశాలమైన వాతావరణం... ఆహా ... అదీ లైఫ్ అంటే... "

చెబుతూనే ఉన్నాడు మహేష్... ఫ్రెండ్ ఎదిగిపోయాడని పొంగిపోవాలో... పుట్టి పెరిగిన నేలను విడిచివెళ్లిన రెండేళ్లల్లోనే, అన్నింటినీ విపరీతంగా చూడటం బాగా అలవాటు చేసుకున్నాడని బాధ పడాలో అర్ధం కాలేదు నాకు... ఈ ఆలోచనల మధ్యలోనే, మహేష్ ఇల్లు రానే ఒచ్చింది... "ఆది" సినిమాలో హీరోలా, తానూ పుట్టిన నేలపై మళ్ళీ అడుగుపెట్టగానే, ఎటువంటి ఎమోషన్ మహేష్ చూబించకపోయినా, ఆంటీ వాళ్ళు మాత్రం, హీరోని చూసి ఆ ఊరి జనాలు రియాక్ట్ అయిన దానికంటే పది రెట్లు ఎక్కువే రియాక్ట్ అయ్యారు... ఈ రియాక్షన్ కి మహేష్ హెచ్చులు చూసి, చిరాకు పడటం నా వంతయ్యింది...

ఇష్టం ఉన్నా లేకపోయినా, ఖర్మ కాలి సార్ గారి ఫ్రెండుని కదా? 12 అవర్స్ ఇన్ అ డే వాడితో కలిసి ఉండటం, అమెరికా రిటర్న్డ్ వేషాలు చూస్తూ, బేలగా నవ్వుకోవడం నా వంతయ్యింది... 15 రోజులు గడిచాయి... నా తలనొప్పి వయస్సు 15 రోజులే మరి... ఇవాళ ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో లంచ్ బ్లాక్ చేసాడు మహేష్... వాడికి తోడు నేను... చెక్ పోస్ట్ దాటుతున్నప్పుడు, మా కళ్ళ ముందు రోడ్ క్రాస్ చేస్తున్న ఒక పెద్దాయన, కళ్ళు తిరిగి పడిపోయాడు... మేము హెల్ప్ కోసం దిగేలోపే, ఒక యంగ్ స్టర్ బెంజ్ నుండి దిగి, ఆ పెద్దాయనని పట్టించుకునే బాధ్యత తీసుకున్నాడు... ఇదంతా చూస్తూ నిలబడ్డ మహేష్... సడెన్ గా సైలెంట్ అయిపోయాడు...

కార్ డ్రైవ్ చేస్తూ, చాలా సేపటి తరువాత నోరు విప్పి, మహేష్ మాట్లాడిన, నాకు నచ్చిన మాట... "అమెరికా లో అన్నీ ఉన్నాయి రా... కానీ మనం చస్తున్నా పట్టించుకునే వాడే ఉండడు... ఏమో ... చాలా అరుదుగా ఉంటారేమో... కానీ ఇంకెక్కడా దొరకనిదీ, ఇండియా లో దొరికేది, ఆప్యాయత మాత్రమె రా... మంచీ చెడులు అనేవి ఎక్కడైనా ఉంటాయి. మనం చూసేదాన్ని బట్టే ప్రపంచం. మహేష్ లా ఇకనుంచి అయినా, చుట్టూ ఉన్న మంచిని ముందు గుర్తించాలని నేను కూడా నేర్చుకున్నా!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fact  Realisation  Life  Incidents  

Other Articles