KTR on contest from andhra

Ktr on contest from andhra

Revanth reddy, KTR, Telangana, GHMC, Elections, TDP

Telangana Minister KTR said that he will contest from Bhimavaram. In andhra also KCR had fans .

ఆంధ్రాలో కేటీఆర్ పోటీ... రేవంత్ రెడ్డి కౌంటర్

Posted: 01/08/2016 03:59 PM IST
Ktr on contest from andhra

ఎన్నికలు ఎన్ని చిత్రాలకైనా దారి తీస్తాయి అంటే ఇదే మరి. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. వచ్చే ఎన్నికల్లో తాను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రాజులతో కేటీర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కెటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో సీఎ కేసీఆర్ పాల్గొంటే ఆంధ్రుల నుంచి వచ్చిన స్పందన మీకు తెలిసిందే అని గుర్తు చేశారు. ఆ ప్రాంతానికి చెందిన ఒకరు వివాహ ఆహ్వాన పత్రం అందించేందుకు వచ్చి అమరావతిలో మా ముఖ్యమంత్రి కన్నా మీ ముఖ్యమంత్రి మాట్లాడేప్పుడే ఎక్కువ చప్పట్లు కొట్టారని అన్నారని కెటీఆర్ తెలిపారు. ఇప్పుడు టీఆర్ఎస్ పేరు మారుతుందని, తెలుగు రాష్ట్ర సమితి అవుతుందని, ఆంధ్రలో కూడా పోటీ చేస్తామని తాను చెప్పినట్టు కేటీఆర్ తెలిపారు.

అయితే కేటీఆర్ వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిని తెలుగు రాష్ట్ర సమితిగా మారుస్తామన్న కేటీఆర్ ప్రకటనపై ఆయన మాట్లాడుతూ, పార్టీ పేరు సంగతి తరువాత, ముందు తెలంగాణ భవన్ పేరును తెలుగు భవన్ గా మార్చాలని సూచించారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీగా ఎందుకు పేర్కోవాల్సి వచ్చిందో కూడా వివరించాలని డిమాండ్ చేశారు. కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ గిమ్మిక్కులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇన్ని మాటలు చెబుతున్న కేటీఆర్ ఇవన్నీ పార్టీ ప్రకటనలా? లేక వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాటలా? అన్నది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తానికి జిహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరి చూడాలి ఎవరి మాటల వల్ల ఎక్కువ ఓట్లు రాలతాయన్నది ఎన్నికల్లో తేలుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth reddy  KTR  Telangana  GHMC  Elections  TDP  

Other Articles