MPs talk about sarees, facials in Parliament

Mps talk about sarees facials in parliament

Parliament, Supriya Sule, Supriya Sule contraversial statements, Supriya Sule with students

For the past sessions, the Parliament of India is more in the news for logjam, than any productive work. Amidst anger over losing crore of the taxpayer's money due to disruptions in Parliament, a statement by Lok Sabha MP and senior Nationalist Congress Party (NCP) leader Supriya Sule will surely cause a controversy.

చీరలపై పార్లమెంట్ లో చర్చ..?

Posted: 01/08/2016 03:43 PM IST
Mps talk about sarees facials in parliament

పార్లమెంట్ లో మన ఎంపీలు దేని గురించి మాట్లాడతారో మీకు తెలిస్తే షాక్ అవుతారు. పార్లమెంట్ ను ఒఓ యుద్దక్షేత్రంగా చేసిన ఎంపీల గురించి, పార్లమెంట్ లో కొట్టుకున్న వారి గురించి.. సభలో చివరకు పెప్పర్ స్ప్రీలు చల్లిన వారి గురించి కూడా విన్నాం. అయితే తాజాగా ఓ ఎంపీగారు అసలు పార్లమెంట్ లో ఎంపీలు ఏం చేస్తారో చెప్పిన విషయాలు వింటే విస్తుపోతారు. ఏంటీ మన ఎంపీలు పార్లమెంట్ లో చేసే పని ఇది అని అనుకుంటారు. అయినా పార్లమెంట్ లో ఏం చేస్తారు అని చెప్పిందో ఎవరో తెలుసా..? శరద్ పవార్ కుమార్తె. అవును ఆమె అన్న మాటలు చదవి విస్తుపోండి..

"నేను పార్లమెంటుకి వెళ్లగానే మొదటి ముగ్గురు మాట్లాడింది వింటాను. ఆ తర్వాత ఆ ముగ్గురూ ఏం మాట్లాడారన్న దానిపై స్పీకర్ మాట్లాడతారు. ఈ నాలుగో వ్యక్తి ఏం మాట్లాడారన్నది అడిగితే మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే నాకది గుర్తుండదు" అంటూ నవ్వేశారామె. "మీలాగే మేం కూడా అక్కడ ఊసులాడుకుంటూ వుంటాం. చెన్నయ్ నుంచి వచ్చిన ఓ ఎంపీతో నేను పార్లమెంటులో మాట్లాడుతూ వున్నాననుకోండి. ఆ దృశ్యాన్ని మీరు పార్లమెంటు గ్యాలరీ నుంచో, లేక టీవీలోనో చూసి, మేం చెన్నయ్ వరదల గురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. వాస్తవానికి అదేమీ కాదు, 'మీ చీర ఎక్కడ కొన్నారు? నా చీర ఎక్కడ కొన్నాను?' వంటి ముచ్చట్లే పెట్టుకుంటాం. మీరూ క్లాసులో ఇలాగే ముచ్చట్లాడుకుంటారు కదా?" అంటూ సుప్రియా సూలే విద్యార్థులను నవ్వుతూ ప్రశ్నించారు.

"ఇవన్నీ చూసే పురుష ఎంపీలు అస్తమాను నన్ను ఆటపట్టిస్తుంటారు. 'పార్లమెంటులో మహిళలకు ఏభై శాతం రిజర్వేషన్ వుంటే కనుక ఇక అక్కడ చర్చలన్నీ బ్యూటీ పార్లర్లపైనా, ఫేసియల్స్ పైనా, చీరలపైనా జరుగుతాయి' అంటూ జోకులేస్తుంటారు. దానికి నేను 'మీరు మాత్రం ఏం చేస్తున్నారిప్పుడు... మాకు అలాంటి అవకాశం ఇస్తే కొంపలేమీ అంటుకుపోవులెండి' అంటూ నేనూ సరదాగానే అంటుంటాను" అంటూ చెప్పుకొచ్చారు సుప్రియ. మొత్తానికి విద్యార్థులతో ఈ ముచ్చట్లు ఆమె సరదాకే పెట్టినప్పటికీ, ఇవి పెద్ద దుమారాన్నే లేపేలా వున్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల సొమ్ము వెచ్చించి నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాల్లో దేశ సమస్యలపై చర్చ జరగడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles