North Korea says it just tested a hydrogen bomb

North korea says it just tested a hydrogen bomb

North Korea, North Korea tested a hydrogen bomb, hydrogen bomb, Kim Jong-un

A 5.1 magnitude "seismic event" was reported near North Korea's Punggye-ri nuclear testing site late Tuesday evening.North Korea's government is claiming that the event was a hydrogen bomb test. Hydrogen bombs are a more powerful type of nuclear weapon than the North has previously tested, one that North Korea first claimed to have developed in December.

ఉత్తరకొరియా హైడ్రోజన్ బాంబ్ ప్రయోగంతో భూకంపం

Posted: 01/06/2016 11:24 AM IST
North korea says it just tested a hydrogen bomb

ఉత్తర కొరియా ఉత్సాహం చూస్తుంటు యుద్దానికి రారా రమ్మని పిలుస్తున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే గత కొంత కాలంగా యుద్దానికి అన్ని ఏర్పాట్లలో నిమగ్నమైన అక్కడి సైన్యం తాజాగా హైడ్రోజన్ బాంబ్ ను ప్రయోగించింది. అయితే అణుబాంబ్ కన్నా ఎంతో ప్రభావవంతమైన హైడ్రోజన్ బాంబ్ ప్రయోగించారు.. ఆ విషయాన్ని ఆ దేశం కూడా వెల్లడించింది. తాము చేసిన హైడ్రోజన్ బాంబ్ ప్రయోగం విజయవంతమైనట్లు ఉత్తర కొరియా వెల్లడించింది. అయితే హైడ్రోజన్ బాంబ్ ప్రయోగంతో అక్కడ భూకంపం వచ్చింది.  ఈశాన్య ఉత్తరకొరియాలో 5.1 తీవ్రతతో 'కృత్రిమ భూకంపం' సంభవించింది. అంతకుముందు.. అందరూ ఉత్తరకొరియాలో సంభవించింది భూకంపమా.. కృత్రిమ భూకంపమా లేదా అణ్వస్త్ర పరీక్షా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దీనిపై పెద్దస్థాయిలో చర్చ మొదలవ్వడంతో.. చివరకు ఉత్తర కొరియానే అధికారికంగా అసలు విషయాన్ని ప్రకటించింది.

2006, 09, 2013లో పరీక్షలు నిర్వహించిన ప్రాంతంలోనే ప్రత్యేక సొరంగంలో తొలిసారి హైడ్రోజన్ బాంబు పరీక్షను నిర్వహించారు. తమ దేశాన్ని అణ్వస్త్ర దేశంగా మరింత బలోపేతం చేసేందుకే.. ఈ పరీక్షలు నిర్వహించినట్టు నార్త్ కొరియా తెలిపింది. ఇటీవలి కాలంలోఅమెరికాను సైతం సవాలు చేస్తున్న ఉత్తరకొరియా.. ఏకంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఇదే మొదటిసారి. మరో రెండు రోజుల్లో.. అంటే ఈ నెల 8వ తేదీన కిమ్ జోంగ్ ఉన్ పుట్టిన రోజు ఉండటంతో తమ సత్తాను నిరూపించుకోడానికి, తమ వద్ద అణ్వస్త్రాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగం చేసిందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : North Korea  North Korea tested a hydrogen bomb  hydrogen bomb  Kim Jong-un  

Other Articles