terrorists used ‘Pak-made’ equipment

Terrorists used pak made equipment

Manohar Parikar, India, Terror Attack, Pakistan, the Air Force base, Pathankot airbase

Defence Minister Manohar Parrikar today admitted to “some gaps” that led to the terror attack on the Air Force base here in which all the six infiltrators, who used some “Pakistan- made” equipment, have been killed. Addressing a news conference after a visit to the forward base, he said the terrorists were neutralised in an operation that lasted for more than 36 hours since 3.30 AM on Saturday but combing operations are still on.

టెర్రరిస్ట్ లు వాడింది పాక్ వస్తువులే

Posted: 01/05/2016 06:14 PM IST
Terrorists used pak made equipment

దేశంలొ ఎంతో కీలకమైన ఎయిర్ బేస్ మీద ముష్కరుల దాడి పట్ల భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ఉగ్రవాదులను తుదముట్టించిన సైనికులను అభినందించడంతో పాటుగా.. అసువులు బాసిన సైనికులకు నివాళినర్పించారు. దేశంలో టెర్రరిస్ట్ లను తుడిచి పెట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ హెచ్చరించారు. పఠాన్ కోట్ లో  ఉగ్రవాదుల దాడులు జరిగిన ఎయిర్ బేస్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు.  ఎయిర్ బేస్ లో ఇప్పటికీ తనిఖీలు, పర్యవేక్షణలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. టెర్రరిస్ట్ ల దాడిలో చనిపోయిన అమర వీరుల కుటుంబాలను అన్నివిధంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్ బేస్ ను సందర్శించిన డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్,  గ్రనేడ్లను తొలగించకుండా అక్కడి కక్కడే పేల్చివేయమని ఆదేశించినట్లు తెలిపారు. గ్రనేడ్ లు  నిర్వీర్యం చేస్తుండగా  ఒక సైనికుడు మరణించినట్లు  తెలిపారు. ఆ తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.   వైమానిక స్థావరంలో  ఎలాంటి నష్టం వాటిల్లకుండా  ఆచీ తూచీ వ్యవహరించిన  సైనికులను ఆయన ప్రశంసించారు.

ఇప్పటివరకూ మొత్తం ఆరుగురు టెర్రరిస్ట్ లు  హతమయ్యారని  మనోహర్ పారికర్ తెలిపారు.  ఎన్ కౌంటర్ 38 గంటలపాటు జరిగిందని,  మిగతా సమయమంతా  వైమానిక స్థావరంలో  గ్రనేడ్ లు, ఇతర  పేలుడు పదార్థాలను కూంబింగ్ చేసేందుకే పట్టిందని మంత్రి తెలిపారు.  టెర్రరిస్ట్ లను  ఏకాకులను చేసి మట్టుపెట్టిన సైనికులను ఆయన అభినందించారు. ఈ దాడికి దారితీసిన కారణాలపై  సమగ్ర దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు. టెర్రరిస్ట్ ల విషయంలో రాజీ ప్రసక్తే లేదన్నారు. రేపు కూడా  తనిఖీలు కొనసాగుతాయని  డిఫెన్స్ మినిస్టర్ తెలిపారు. ఆపరేషన్ పఠాన్ కోట్ పూర్తయిన విషయాన్ని ఎన్ ఎస్ ఏ ప్రకటించగలదని తెలిపారు.  దురదృష్టవశాత్తూ  ఏడుగురు ఈ ఆపరేషన్ లో మరణించడం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు.  అయితే టెర్రరిస్టులు వాడిన వస్తువులు పాకిస్థాన్ కు చెందినవిగా తాము గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు అర్థమవుతోందని.. దీనిపై కఠినంగానే స్పందిస్తామని పారేకర్ వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manohar Parikar  India  Terror Attack  Pakistan  the Air Force base  Pathankot airbase  

Other Articles