Marriage in every life with two different minds

Marriage in every life with two different minds

Marriage, NMarriage Life, Life Partner, Wife, Family, Husband

Many of us believing that Marriages are made in heaven. but some of us very scares to get marriage.

అమ్మో "పెళ్లి" v/s ఆహా కల్యాణం

Posted: 01/05/2016 05:55 PM IST
Marriage in every life with two different minds

"పెళ్ళా??? ఈ ప్రపంచం మొత్తం మీద, అస్సలు అవసరం లేని పని, పని మాల్న మన ప్రశాంతత చెడగొట్టే పని ఏదైనా ఉందంటే, అది పెళ్ళే... "

"జీవితం అయిపోయిందా??? 25 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటారా??? ఆదరా బాదరా పడి, ఎవరో ఒకరిని చేసుకుని, తరువాత వాళ్ళు మనకు సూట్ అవ్వలేదని విడిపోవడానికి నానా తంటాలు పడి, చివరికి విడిపోయిన తరువాత, తిరిగి మళ్ళీ జీవితంలో ఒంటరిగా సెటిల్ అయ్యి, ఇంకో మిస్టర్ ఆర్ మిస్ రైట్ ని వెతుక్కుని... ఇంత ఆయాసపడేదానికన్నా, ఎంచక్కా బాగా ఆలోచించి, ఆన్నీ చూసుకుని, కరెక్ట్ పర్సెన్ ని చూస్ చేసుకుని, పెళ్లి చేసుకుంటే బెటర్..."

"ఒంటరిగా జీవితం బాగానే ఉందిగా??? నా లైఫ్ నా ఇష్టం... ఇష్టం ఉంటే పని చేస్తా, లేదంటే అన్నీ మానేసి, సేవింగ్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తూ, ఇంకో ఉద్యోగం కోసం వెతుక్కుంటా... ఇష్టం ఉంటే వండుకుని తింటా, కష్టం అయితే ఆర్డర్ చేసుకుని తింటా... అమ్మా - నాన్నా, ఎప్పుడో ఒకసారి ఒచ్చిపోతూ ఉంటారు... మరీ నస పెడితే, నేను వెళ్లి రెండు రోజులు ఉండి ఒస్తూ ఉంటాను... ఇలా హ్యాపీగా ఉండక, నా లైఫ్, ఫ్రీడం, జీతం, పీస్ ఆఫ్ మైండ్ తీసుకెళ్ళి, పెళ్లి పేరుతో భాగస్వామి, తన కుటుంబ సభ్యులు అనే ఎవరో ముక్కూ మొహం తెలీని వారి చేతుల్లో పెట్టి, పెళ్లి పేరుతో నేను చేసిన తప్పుకు ఆ దేవుడిని తిట్టుకుంటూ, ఏడుస్తూ బతకడం కన్నా పిచ్చితనం ఇంకోటి ఉంటుందా???"

ఏళ్ళు - ఏళ్ళు ప్రేమించుకుని, అందరినీ కాదని పెళ్లి చేసుకున్నవారే అయితే భాగస్వామి చేతిలో, లేదా అత్తా - మామల హింస వల్ల మోసపోతున్నారు... అదీ కాదంటే, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఒచ్చి విడిపోతున్నారు... ఇక ముక్కూ మొహం తెలీని వారిని, అది కూడా వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు పెద్దోళ్ళు తెచ్చే సంబంధాన్ని చేసుకుంటే ఏం లైఫ్ ఉంటుందిరా బాబు..."

"మనకేం కావాలో తెలిసిన పెద్దలు తెచ్చిన సంబంధాలే, ఒకరితో ఒకరికి సరిపడక పెటాకులు అవుతున్నాయి... ఇంక ప్రేమ పెళ్ళిళ్ళు ఏం సక్సెస్ అవుతాయి? అంతా నాన్సెన్స్... "

"రోజు మా అమ్మా నాన్ననీ ... అక్కా - బావ/ అన్నా - వదిన ని చూస్తూనే ఉన్నాగా? అందరికేమో ఆదర్శ దంపతులు... ఇంట్లో ఏమో క్షణం పాడనీ బద్ధ శత్రువులు... వీళ్ళను చూస్తూ కూడా, ఇంకా పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందా?"

ఇవాళ రేపు అమ్మాయిలు యమా స్పీడు... అబ్బాయిలు టెరిఫిక్ స్పీడు... మన దాకా వచ్చే ముందు, ఎవరికి ఎన్ని "మరో చరిత్రలు" ఉన్నాయో ఎవరికి తెలుసు... ఇప్పుడవసరమా ఈ పెళ్లి - గిల్లీ???"

సిచువేషన్స్ కాస్త అటూ - ఇటూ అయినా, జీవితంలో పెళ్లి ఒద్దు అనడానికి, పైన చెప్పిన ఏదో ఒక ఉదాహరణతో మనల్ని మనం రిలేట్ చేసుకోవచ్చు...

చిన్న వయస్సులోనే అన్నీ విషయాలకు అవసరంకన్నా ఎక్కువ ఎక్స్పోస్ కావడం,

మనకి అంతగా నచ్చని ఏ విషయాన్నయినా, నచ్చని వారు ఎవ్వరి గురించైనా, ముందు, ప్రతికూలంగానే ఆలోచించడం,

మనకే అంతా తెలుసు అనుకుని, ప్రతీ సంఘటన మీదా చాలా త్వరగా కంక్లూషన్ కి వచ్చెయ్యడం,

సరి అయిన భాగస్వామిని ఎంచుకోలేక తొందరపాటుతో బాధ పడి, ఆ బంధం నుంచి బయట పడినా, దాని తాలూకు చేదు అనుభవాలు, ఇంకా మనల్ని వీడకపోవడం,

ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, ఒక 10 సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని సంపాదన ఆ తరువాత పెళ్లి అని జీవితానికీ, జీవితంలోని అంశాలకీ లింక్ పెట్టడం,

అవసరంకన్నా ఎక్కు స్వేచ్చను అనుభవించే అలవాటు మానుకోలేకపోవడం,

"స్వాతంత్ర్యం", ఇది పెళ్లితో నాశనం అయిపోతుంది అని భ్రమ పడటం,

పెళ్లి - క్రమబద్ధీకర జీవితానికి విరుద్ధంగా ఉండే వారి సాంగత్యంలో ఎక్కువ గడపడం,

పోట్లాటకీ, గిల్లి - కాజ్జాలకీ - హింస కీ - సరదాకీ తేడా తెలుసుకోలేకపోవడం,

ఎవ్వరినీ నమ్మలేకపోవడం ... భాగస్వామిగా ఒచ్చేవారి మీద కూడా నమ్మకం ఉంచలేమేమో అని ముందే భయపడటం ... విపరీతమైన అనుమానం, ఇన్సెక్యూరిటీ,

ఇవన్నీ, నేడు మనలో ఎంతో మంది, పెళ్లి ఒద్దు అనడానికీ, వివాహాన్ని బిజినెస్ గా చూడటానికీ, వివాహం చేసుకున్నా ఆనందంగా ఉండలేకపోవడానికీ ముఖ్య కారణాలు...

చిన్న ఉదాహరణతో, వివాహం మీద ఒక అభిప్రాయానికి రావడం మీ అంచనాకే ఒదిలేస్తున్నా...

రోడ్డు మీద ఒక భయంకరమైన ఆక్సిడెంట్ చూస్తాం... ఒకటో లేక రెండు రోజులో భయపడతాం... కానీ తిరిగి ప్రయాణం చేస్తాం, మన జాగ్రత్తలు మనం తీసుకోవడం ద్వారా... ఇతర వాహనదారుల నుంచి సరిగ్గా నడపాలనిగానీ, అతి వేగంగా వారు దూసుకుపోవాలని కానీ మనం ఆసించం... మనం ఎలా ప్రయాణించాలో మాత్రం పూర్తి అవగాహనతో ఉంటాం... ఎదుటివారు సరిగ్గా నడిపితే ఆనందిస్తాం... రాష్ గా వెళితే? "వీళ్ళ ఖర్మ" అని తిట్టుకుని వదిలేస్తాం...

జీవితపు ప్రయాణమూ అంతే ... మన జాగ్రత్తలో మనం ఉండి, ఎదుటివారి నుంచి ఏమీ ఆశించక, వారు అందించే ప్రేమను ఆస్వాదిస్తే... మనకున్న విజ్ఞ్యతను భాగస్వామి ఎంపిక లో ఉంచితే, "పెళ్లి" మంచిదే...

ఆ సినిమాలో అన్నట్టు, వంటరి ప్రయాణం ఎప్పుడూ విసుగే... జంట ప్రయాణంలో రిస్కు, విసుగూ ఉన్నా, ఆనందం కూడా ఉంటుంది... అందుకే, యెంత విసుక్కున్నా, మనవారి సాంగత్యంలో మనం అంతే ఆనందాన్ని పొందుతాం ! 

 

"సునయన బాదం"

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Marriage  NMarriage Life  Life Partner  Wife  Family  Husband  

Other Articles