Telugu Hero nikhil questions Modi on twitter

Telugu hero nikhil questions modi on twitter

Nikhil, Modi, tweets to Modi, Hero Nikhil, Nikhil Tweets

Telugu hero Nikhil rise his voice through social media twitter. He questions about crued oil price in india.

మోదీకి హీరో నిఖిల్ ప్రశ్న.. ఏమిటంటే

Posted: 01/05/2016 11:40 AM IST
Telugu hero nikhil questions modi on twitter

తెలుగు అప్ కమింగ్ హీరోల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు. అదేంటి హీరో నిఖిల్ కు మోదీని ప్రశ్నించాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారా..? అతడు కూడా సగటు భారతీయుడే. అతడు అడిగిన ప్రశ్నలు కూడా మామూలు జనాలు రోజూ అనుకునేవే. అయితే సినిమాలు తీసుకునే వాళ్లు మామూలుగా అయితే తమ సినిమాకు సంబందించిన అంశాలనే చర్చిస్తుంటారు. కానీ నిఖిల్ మాత్రం తాను ఓ స్టార్ లాగా కాకుండా సాధారణ పౌరుడిగా మోదీని ప్రశ్నించారు. ఇంతకీ నిఖిల్ దేని మీద ప్రశ్నించారో తెలుసా..? దేశంలో క్రూడాయిల్ రేట్ల గురించి.. అవును మీరే చూడండి.

2002లో ఒక బేరల్ క్రూడ్ ఆయిల్ ధర 37 డాలర్లు ఉండగా ఇండియాలో లీటర్ ఆయిల్ ధర 28 రూపాయలు, 2016లో అదే ఒక బేరల్ క్రూడ్ ఆయిల్ ధర 37 డాలర్లు ఉండగా మన దగ్గర మాత్రం లీటరు ఆయిల్ 66 రూపాయలు ఉంది. దీనిని వివరించగలరా అని మోదీని నిఖిల్ ప్రశ్నించారు. క్రూడ్ ఆయిల్ ధర ఒకటే అయినప్పుడు పెట్రోల్ ధరలలో మార్పులు ఎందుకు అని, రిఫైనింగ్ కాస్ట్, లేబర్ ఛార్జీలు పెరిగాయి అని అనుకున్నప్పటికీ కూడా మరీ ధరలు ఇంతలా పెరుగుతాయా అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Modi  tweets to Modi  Hero Nikhil  Nikhil Tweets  

Other Articles