Even on Day Two, Delhi's clean air plan seems to work

Odd even delhiites follow rules for second day

Sisodia, arvind kejriwal, delhi, Odd even formula, odd even rule, odd even formula, odd even scheme, delhi odd even, delhi odd even rule, odd even gopal rai, odd even news

"Mere rules can not change anything, change of mindset is needed which we aimed at through implementation of odd-even formula," said Rai.

పురవీధుల్లో తగ్గిన కాలుష్యం.. కేజ్రీ ఫార్ములా సక్సెస్ అంటున్న సిసోడియా..

Posted: 01/03/2016 10:38 AM IST
Odd even delhiites follow rules for second day

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న 'సరి-బేసి' నెంబర్‌ ప్లేట్ విధానం విజయవంతమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండోరోజు శనివారం ఈ విధానం అమలు వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఇదే రోజుతో పోల్చుకుంటే హస్తినలో వాయుకాలుష్యం దాదాపు 300శాతం తగ్గిందని తాజాగా తేలింది. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ ఆధారంగా వాహనాలను దినం తప్పించి దినం రోడ్లకు మీదకు అనుమతించాలని కేజ్రీవాల్ సర్కార్ ప్రతిపాదించిన ఈ పథకంపై మిశ్రమ స్పందన వ్యక్తమైన సంగతి తెలిసిందే. జనవరి 1 నుంచి ఈ విధానం ఢిల్లీలో అమల్లోకి వచ్చింది.

అయితే, సోమవారం నుంచి కార్యాలయాలు తిరిగి తెరుచుకోవడం.. ఉద్యోగులు పెద్దసంఖ్యలో వాహనాలతో రోడ్ల మీదకు రానుండటంతో సోమవారం నుంచి 'సరి-బేసి' విధానం మీద అసలు పరీక్ష మొదలవుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విధానం అమల్లో భాగంగా సైకిల్‌ మీద తన కార్యాలయానికి వెళ్లి అందరి దృష్టి ఆకర్షించిన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడుతూ 'సరి-బేసి' విధానం అమలు విజయవంతంగా కొనసాగుతున్నదని, ఈ విధానం అమలు వల్ల శనివారం ఒక్కరోజు 300శాతం వాయు కాలుష్యం తగ్గిందని తెలిపారు. 15 రోజులు ఈ విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తే.. నగరంలో కాలుష్యంపై ప్రజలకు చైతన్యం పెరిగి.. ప్రత్యామ్నాయా రవాణా సదుపాయాన్ని కూడా వారు వినియోగించుకునే అవకాశముందని ఆయన చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sisodia  arvind kejriwal  delhi  Odd even formula  

Other Articles