ISI trap IAF man through Facebook

Isi trap iaf man through facebook

IAF, Facebook, ISI, Indian Air Base, Ranjith KK, Pakistan, Pakistan ISI

Ranjith KK, an Indian Air Force employee, got a Facebook friend request from a pretty woman based in the United Kingdom three years ago. He thought himself the luckiest of young men when the friendship took a spicy turn that included dirty talk late into the night. Already addicted to social media, the 30-something man began to remain online almost through the day for the woman, McNaught Damini, to come online and fulfil his fantasies.

అమ్మాయి పేరుతో ఐఎస్ఐ ఫేస్ బుక్ చేసింది

Posted: 12/30/2015 10:34 AM IST
Isi trap iaf man through facebook

తమకు పక్క దేశాల నుండి ఎప్పటికైనా ముప్పు వాటిల్లుతుంది అని బావించే దేశాలు తమ శత్రు దేశాల సమాచారాన్ని సేకరిస్తు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటాయి. అందులో భాగంగా సోషల్ మీడియా ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తాయి. అయితే తాజాగా భారత వైమానికి దళానికి చెందిన కీలక సమాచారాన్ని అందించి ఓ ఉద్యోగి ఐఎస్ఐ ట్రాప్ లో చిక్కుకున్నాడు. అందమైన యువతి పేరుతో అతడిని ట్రాప్ చెయ్యడమే కాకుండా వైమానికి దళం కెపాసిటీ, ఏ ఏ ఐఎఎఫ్(IAF) కేంద్రం ఎలా పని చేస్తోందని సమాచారాన్ని సేకరించింది. అయితే పోలీసులు, ఇంటలిజెన్స్ రాకతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. భారత వైమానిక దళానికి సంబందించిన వివరాలను బయటకు లీక్ చేసినందుకు అతడిని సస్పెండ్ చేసింది ఎయిర్ ఫోర్స్. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు అతడి నుండి మరిన్ని వివరాలను రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. దామినీ పేరుతో జరిగిన మొత్తం తతంగం మీ కోసం...

రంజిత్ కె.కె అనే వ్యక్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో లీడ్ ఎయిర్ క్రాఫ్ట్ మెన్ గా పని చేస్తున్నాడు. 2012లో అతడికి దామిని అనే పేరుతో ఓ అందమైన ఫోటో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. యుకెకు చెందిన అమ్మాయిని అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. అలా అలా వారిద్దరి మధ్య పరిచయం కాస్త క్లోజ్ గా మూవ్ అయ్యే వరకు వచ్చింది. తర్వాత తను ఓ మ్యాగజీన్ కు పని చేస్తున్నానని.. ఎయిర్ ఫోర్స్ కు సంబందించిన డిటేల్స్ అడిగింది. ఓ సారి ఆయనకు 30 వేల రూపాయలు కూడా అందాయి. గ్వాలియర్ ఎయిర్ బేస్ వివరాలు, ఐఎఎఫ్ జెట్స్ , మిగిలిన యూనిట్ల వివరాలను కూడా అడిగితెలుసుకున్నారు. అయితే నిజానికి ఆ అకౌంట్ అమ్మాయిది కాదు.. ఐఎస్ఐ గూఢచారిది అని నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో దేశానికి సంబందించిన కీలక సమాచారాన్ని లీక్ చేసినందుకు అతడి జాబ్ ఊడటంతో పాటు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి చివరకు ఐఎస్ఐ కూడా ఇండియాకు చెందిన సమాచారాన్ని సేకరిస్తుండటంపై నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IAF  Facebook  ISI  Indian Air Base  Ranjith KK  Pakistan  Pakistan ISI  

Other Articles