Mother wins poll and daughter gang raped

Mother wins poll and daughter gang raped

Gang Rape, rape, Uttarpradesh, daughter gang raped, Mirzapur

In a heinous incident, a 16-year-old girl was, last week, gang-raped by two men, who held a grudge against her mother after their defeat in the recently-concluded panchayat polls in the district. The Class 11 girl hanged herself on December 25 as she was unable to bear the humiliation of gang-rape and subsequent apathy of police, which had allegedly refused to register a case after the incident.

తల్లి గెలిచిందని కూతురిని రేప్ చేశారు

Posted: 12/28/2015 01:16 PM IST
Mother wins poll and daughter gang raped

అవును.. కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలు చేసిన వారి గురించి మనం చాలా చదివాం. కానీ పగతో రేప్ చేసిన వాళ్లను.. అది కూడా తల్లి మీద కోపంతో కూతురుని కిడ్నాప్ చేసి రేప్ చేసిన ఘనట గురించి ఎన్నడైనా విన్నామా..? కానీ ఉత్తర్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ ఓ అమ్మాయి మానాన్ని బలిగొంది. తల్లిమీద కోపంతో ఇంటర్ చదువుతన్న అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేశారు. పాపం అమ్మాయి అవమానం తట్టుకోలేక చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకున్న ఈ దారుణంపై దేశవ్యాన్తంగా సంచలనం రేగింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు ప్రతీకారంతో విజేత కూతురిపై అమానుషంగా ప్రవర్తించారు. ఎన్నికల్లో గెలిచిన మహిళ కూతురిని ప్రత్యర్థులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. తరువాతి రోజు బాధితురాలితో కలసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. కానీ తర్వాత బాధితురాలు ఆత్మహత్య చేసుకున్నాక, తీవ్ర విమర్శలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు మీర్జాపూర్ జిల్లా ఎస్పీ చెప్పారు. జాత్యహంకారంతో..పగతో చివరకు అభంశుభం ఎరుగని చిన్నారి ఉసురుతీశారు రాక్షసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gang Rape  rape  Uttarpradesh  daughter gang raped  Mirzapur  

Other Articles