lets use Divyaang instead of Vikalang

Lets use divyaang instead of vikalang

Modi, Mann ki Baat, India, vikalaang, Divyaang, Physically Handicape, Narendra Modi

PM Modi, during his radio address, appealed people to use the word 'divyaang' instead of 'viklaang' while referring to a person with physical disabilities. "In our country, let us use the word 'divyaang' instead 'viklaang' (physically challenged). These people are gifted with extra ability," the PM said.

వికలాంగులు కాదు దివ్యాంగులు: మోదీ

Posted: 12/28/2015 08:32 AM IST
Lets use divyaang instead of vikalang

వికలాంగులను ప్రధాని నరేంద్ర మోదీ దివ్యాంగులుగా అభివర్ణించారు. వికలాంగుల కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. సాధారణ ప్రజలకులేని సామర్థ్యాలు కొన్నిసార్లు వికలాంగుల్లో కనిపిస్తాయని చెప్పారు. వచ్చే నెల 12 నుంచి 16 వరకు రాయ్‌పూర్‌లో జాతీయ యువజనోత్సవాలు జరుగుతాయని ప్రధాని చెప్పారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని నిర్వహించనున్న యువజనోత్సవాలు అభివృద్ధి నైపుణ్యం, సామరస్యంపై భారత యువత అంశంపై జరుగుతాయని తెలిపారు. ప్రధాని దేశప్రజలకు రెండు రోజులు ఆలస్యంగా క్రిస్మస్, నాలుగు రోజులు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

భిన్నత్వం కారణంగానే మనదేశం వరుసగా పండుగులను జరుపుకుంటున్నదని అన్నారు. ఒక పండుగ వాతావరణం ముగియకముందే మరో పండుగ వస్తుందన్నారు. ఈ పండుగల కారణంగా కొన్నిసార్లు భారత్ పండుగల ఆధారిత ఆర్థికవ్యవస్థ అన్న భావన కలుగుతుందన్నారు. దేశ ప్రజలు ఉన్నత శిఖరాలను చేరుకొనే సంతోషం, కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం, కొత్త సంకల్పాన్ని వచ్చే నూతన సంవత్సరం తీసుకురావాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎల్పీజీ సబ్సిడీని లబ్ధిదారులకు నేరుగా బదిలీ చేయడాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, 15 కోట్ల మంది లబ్ధి పొందుతున్న ఈ పథకం గిన్నిస్ రికార్డులకెక్కిందని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభంలో, బీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని భారత రాజ్యాంగంపై చాలా చక్కటి చర్చ జరిగిందని పేర్కొన్నారు. దేశ ప్రజల విధులను తెలియచేసేందుకు చర్చాగోష్ఠులు, ఎగ్జిబిషన్లు నిర్వహించాలని సూచించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవంనాటికి దేశంలోని అన్ని ప్రముఖుల విగ్రహాలను శుభ్రం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Mann ki Baat  India  vikalaang  Divyaang  Physically Handicape  Narendra Modi  

Other Articles