police restrictions on new year celebrations

Police issue guidlines for new year celebrations

Cyberabad Police, Police Commissioner C V Anand, Resorts Farmhouses, bars, star hotels, pubs, resorts, farmhouses, police restrictions, police guidelines, new year eve, police cases drunk drive,

The Cyberabad police have tightened New Year’s Eve restrictions on star hotels, pubs, resorts and farmhouses under its jurisdiction.

కొత్త సంవత్సరాది సంబరాలకు పోలీసులు అంక్షలు

Posted: 12/27/2015 04:14 PM IST
Police issue guidlines for new year celebrations

నగరంలో కొత్త సంవత్సరం వేడుకలను డిసెంబరు 31వ తేదీ రాత్రి 8గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించుకోవాలని సైబరాబాద్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ 25 స్టార్‌ హోటల్స్‌, 3 పబ్‌లు, 22 రిసోర్టులు, 269 ఫాంహౌస్‌లు ఉన్నాయన్నారు. వీరందరూ ఈ నిబంధనలను పాటించాలన్నారు.

*     ఆహ్వానం ఉన్న అతిథులను మాత్రమే లోపలికి అనుమతించాలి. జంటలను మాత్రమే అనుమతించాలి.
*     పోలీస్‌ కమిషనర్‌ అనుమతిలేకుండా నూతన సంవత్సర వేడుకల పోస్టర్లు, హోర్డింగ్‌లను బహిరంగ ప్రదేశాల్లో డిస్‌ప్లే చేయకూడదు. అతిక్రమిస్తే ఏపీ గేమింగ్‌ యాక్ట్‌ 1974 నమోదు చేస్తారు.
*     డీజేలకు అనుమతి లేదు. లౌడ్‌ స్పీకర్ల శబ్దం 45 డీసీబిల్స్‌కి మించరాదు. ఆర్గనైజర్స్‌ ఎస్‌హెచ్‌వో/ఏసీపీ ప్రత్యేక అనుమతితోనే డీజే వాడాలి. అశ్లీల నృత్యాలు, నటనలు, సినిమా ప్రదర్శన నిషేధం.
*     ఈవెంట్‌ ప్రచారం కోసం నగ్న చిత్రాలు, అర్ధనగ్న చిత్రాలతో పత్రికల్లో ప్రకటలు ఇవ్వడం, టీవీ ప్రకటనలు ఇవ్వడం నివేధం.
*    మద్యం సేవించిన వారిని, అనుచితంగా ప్రవర్తించేవారిని లోపలికి అనుమతించకూడదు.
*    ప్రదర్శనలు ప్రమాదకరంగా ఉండకూడదు. మారణాయుధాలతో తిరగరాదు.
*    డివిజన్‌ ఫైర్‌ ఆఫీసర్‌/రీజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ సూచనలను పాటించాలి.
*    అతిథిలందరికి ఈ నిబంధలను ముందుగానే చెప్పాలి.
*    పోగ్రాం ప్రారంభమైనప్పటి నుంచి పూరైంత వరకు ఆహూతులతో సహా రికార్డు చేసి పోగ్రాం సిడీలను రెండు రోజులలోపు తనిఖీ కోసం సైబరాబాద్‌ కమిషరేట్‌లో సమర్పించాలి.
*    నగరంతోపాటు ఓఆర్‌ఆర్‌పై డ్రంకన్‌ డ్రైవ్‌, ఓవర్‌ స్పీడ్‌ తనిఖీలకు ప్రత్యేక పోలీసుల బృందాలుంటాయి. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి.
*   వేదిక లోపలి ప్రాంగణంలో వాహనాలను పార్క్‌ చేయాలి. రోడ్డు మీద పార్క్‌ చేయడానికి అనుమతించరు.
*   సాధారణ ప్రజలు 31వ తేదీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఓఆర్‌ఆర్‌పై అనుమతి లేదు. శంషాబాద్‌ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేవారిని, వచ్చే వారిని, ఇతర ప్రముఖలను అనుమతిస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyberabad Police  Police Commissioner C V Anand  Resorts Farmhouses  

Other Articles