up minister ompal nehra sacked for his appeal to muslim

Akhilesh sacks up minister for muslims should build temple remark

Ompal Nehra,Uttar Pradesh minister sacked, Ayodhya,VHP,Mathura Kashi,Muslims must help in temples,Ram temple,Krishna temple,Babri mosque, muslims, uttar pradesh, Akhilesh Yadav,

A senior Samajwadi Party leader who enjoyed the status of minister in Uttar Pradesh, Ompal Nehra, has been sacked after his comment on Muslims.

వివాదాస్పద వ్యాఖ్యల ఫలితం.. మంత్రికి ఉద్వాసన

Posted: 12/25/2015 05:52 PM IST
Akhilesh sacks up minister for muslims should build temple remark

ఉత్తర ప్రదేశ్ మంత్రి ఓంపాల్ నెహ్రాకు మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఉత్తర్ ప్రధేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. ముస్లింపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లుఅఖిలేష్‌యాదవ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ముస్లింలు ...హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకరించాలని ఓంపాల్ నెహ్రా గత రాత్రి బిజ్నోర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

అలాగే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగితే ముస్లింలు అందుకు సహకరించాలని, కరసేవలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన సూచించారు. అలాగే మథురలో కృష్ణ దేవాలయ నిర్మాణానికి మద్దతు ఇవ్వాలని ఓంపాల్ నెహ్రా పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో సీఎం అఖిలేష్ ...ఆయనను కేబినెట్ నుంచి తప్పించారు. అయితే హిందువులకు వ్యతిరేకంగా, ముస్లింలకు అండగా నిలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న పలువురు సీనియర్ మంత్రులను వెనకేసుకోస్తున్న అఖిలేష్ ప్రభుత్వం.. నెహ్రాపై ఉన్నఫలంగా చర్యలు తీసుకోవడమేంటన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ompal Nehra  muslims  uttar pradesh  Akhilesh Yadav  

Other Articles