Indian men who were beaten up by Saudi employer to return home within a week

Three indians beaten brutally by saudi employer tortured youths to return from saudi arabia

Haripad town, Kerala Men, Saudi Arabia, Sushma Swaraj, three Indian migrant workers, three keralites beaten by employer, Saudi Arabian employer, wooden plank, viral on WhatsApp.

The three workers were reportedly duped by a placement agency that made false promises of getting them jobs.

సౌదీలో భారతీయులను చితకబాదిన యజమాని, విదేశాంగ శాఖ జోక్యం

Posted: 12/25/2015 01:53 PM IST
Three indians beaten brutally by saudi employer tortured youths to return from saudi arabia

సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయులపై యజమాని విచక్షణారహితంగా దాడిచేసిన వీడియో కలకలం రేపింది. బాధితులు ఉత్తర కేరళలోని హరిపాద్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. యజమాని తమను వేధిస్తున్నాడని, కాపాడాలంటూ ఈ వీడియోను కుటుంబ సభ్యులకు పంపారు. సౌదీ వ్యక్తి చేతిలో లావుపాటి కర్ర పట్టుకుని బాధితులు ముగ్గురినీ కర్కశకంగా కొడుతున్నట్టు దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. యెమెన్ లో ఎలక్ట్రిషీయన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి వారిని సౌదీ అరేబియాకు తీసుకెళ్లారు. అక్కడ ఇటుక బట్టీల్లో పనిచేయాలని వారిని వేధించారు.

ఈ అమానవీయ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాంది స్పందించారు. సౌదీలోని భారత ఎంబసీ, కేరళ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. రెండు రోజుల్లో బాధితులను కేరళ తీసుకొస్తామని హామీయిచ్చారు. అటు ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా స్పందించారు. వారం రోజుల లోపు వారిని భారత్ కు తీసుకువస్తామని అమె హామీ ఇచ్చారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు సౌదీ అరేబియా పోలీసులకు ఈ విషయమై పిర్యాదు చేశారని కూడా తెలిపారు. మధ్య ఆసియా దేశాల్లో ఉద్యోగాలతో కేరళవాసులు ఎంతో మంది మోసపోతున్నారు. ప్రమాద పరిస్థితుల్లో చిక్కుకున్నా పేదరికం కారణంగా వెనక్కు రాలేకపోతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haripad town  Kerala Men  Saudi Arabia  Sushma Swaraj  

Other Articles