KCRs Rs 7crore puja In drought hit Telangana

Kcrs rs 7crore puja in drought hit telangana

KCR, Yagam, Ayatha Chandi yagam, Telangana, Drought, farmers, farmers suicide

Even as thousands of people are reeling under drought in Telangana, Chief Minister K Chandrasekhar Rao is organising an Ayutha Maha Chandi Yagam on a scale that is unprecedented.

ITEMVIDEOS: కేసీఆర్ యాగం కాదు.. సాయం చేయాలి

Posted: 12/24/2015 10:31 AM IST
Kcrs rs 7crore puja in drought hit telangana

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 1500 మంది పురోహితులతో, రోజుకు యాభై వేల మంది అతిథులతో ఆయుత చండీయాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం మీద తెలుగు మీడియాలో విస్రృతంగా కథనాలు, కవరేజ్ వస్తున్నా కానీ జాతీయ మీడియాలో మాత్రం సీన్ వేరేలా ఉంది. కేసీఆర్ ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారు.. అసలు ఎందుకంత అవసరం.. రాష్ట్రంలో మిగిలిన సమస్యల మీద దృష్టిసారించాలి అన్న కోణంలో కథనాలు ప్రసారమయ్యాయి. ఏడు కోట్లరూపాయలతో అంగరంగ వైభవంగా చరిత్రలో నిలిచేలా చేస్తున్న ఆయుత చండీయాగం మీద ఉన్న చిత్తశుద్ది ఎందుకు మిగిలిన సమస్యల మీద లేదు అని జాతీయ మీడియా కేసీఆర్ ను నిలదీసింది.

Also Read: నిన్న చంద్రబాబు.. ఇవాళ కేసీఆర్.. ఇకపై ఇదే కంటిన్యూ..

ఎన్డీటీవీతో పలు జాతీయ మీడియా చానల్స్ కేసీఆర్ వైఖరిని తప్పుపట్టాయి. కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత మహా చండీయాగం నిర్వహణ మీద భిన్న కథనాలను ప్రసారం చెయ్యడమే కాకుండా కేసీఆర్ చేస్తున్న పనిని కూడా తప్పుపట్టాయి. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి కేసీఆర్ రైతుల ఆత్మహత్యల మీద పెద్దగా స్పందించడం లేదన్నది ఎంతో కాలంగా వినిపిస్తున్న విమర్శ. అయితే ఆత్మహత్యలు చేసుకున్న కటుంబాలను ఆదుకోవడం,  వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సాయం అందించడం లాంటివి ముందు చూడాలని సూచించింది. యాగానికి వచ్చిన వారికి అదిరిపోయే విందు కాదు.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబ సభ్యలు కడుపులు నింపాలని జాతీయ మీడియా అభిప్రాయపడింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Yagam  Ayatha Chandi yagam  Telangana  Drought  farmers  farmers suicide  

Other Articles