you willbe jailed If u drunk and drive on deceber 31

You willbe jailed if u drunk and drive on deceber 31

Drunk And Drive, drunk cases, Hyderabad, New Year, New Year celebrations

you willbe jailed If u drunk and drive on deceber 31. Every body getting ready to celebrate New year celebrations. Many of us enjoys with liquior after that every one wish to ride.

డిసెంబర్ 31 నాడు జైళుకు..?

Posted: 12/24/2015 09:33 AM IST
You willbe jailed if u drunk and drive on deceber 31

జనం డిసెంబర్‌ 31ఏర్పాట్లలో అందరూ ముందు నుండి తలమునకలై ఉన్నారు. అయితే పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారు. కాని, ఆ ఏర్పాట్లు వారి కోసం కాదు. తాగి డ్రైవ్‌ చేసే మందుబాబుల పనిపట్టటానికి. మామూలు రోజుల్లోనే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కార్యక్రమం పోలీసులకు ఓ సవాలు. ఇక థర్టీ ఫస్ట్‌ డిసెంబర్‌ నాడు ఎలా వుంటుంది? తాగి బండి నడిపే మందుబాబులను నియంత్రించటం కాస్త కష్టమే. అందుకే హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు.

డిసెంబర్‌ 31 నాడు హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలోని ఫ్లై ఓవర్లపై వాహనాల రాకపోకలు నిషేదించనున్నారు.హూస్సేన్‌ సాగర్‌, నక్లెస్ రోడ్డు చుట్టు పక్కల కూడా ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.ఇక రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్ కలిపే PVNఎక్స్‌ప్రెస్‌ వేను కూడా మూసివేయనున్నారు. తాగి బండి నడిపితే ఉపేక్షించే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు. ముందు వాహనాన్ని సీజ్‌ చేస్తారు. తరువాత కౌన్సెలింగ్‌ చేసి కోర్టుకు తీసుకుపోతారు. చాలా కేసుల్లో ఫైన్‌తో పాటు జైలు శిక్షలు కూడా పడుతున్నాయి. రూల్స్‌ అతిక్రమించే వాళ్ల పట్ల చూసీచూడనట్టుగా వ్యవహరిస్తే మళ్లీ మళ్లీ అదే తప్పుచేస్తారని పోలీసులు అంటున్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కి సంబంధించి పోలీసుల దగ్గర పూర్తి సమాచారం వుంది. ఒక సారి పట్టుబడ్డ వారు మళ్లీ దొరికిపోతే వారికి శిక్ష పెంచాలని పోలీసులు రికమండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా కేసుల్లో జైలు శిక్షలు పడుతున్నాయి. నాలుగైదేళ్ల నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ విషయంలో ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మందుబాబుల్లో ఏటేటా మార్పు కనిపిస్తోంది. 2011లో సిటీ పోలీసులు 56వేల 386 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు బుక్‌ చేశారు. అందులో ఆరువేల 502 కేసుల్లో జైలు శిక్షలు పడ్డాయి. ఈ ఏడాది 15వేల 13 మంది పట్టుబడగా 2వేల 672 మందిని జైలుకు పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk And Drive  drunk cases  Hyderabad  New Year  New Year celebrations  

Other Articles