pilot refuses to wait for the Governor

Pilot refuses to wait for the governor

Governor, Kerala, P Sathasivam, Air India flight, Governor Late

Last night, Kerala governor Justice P Sathasivam failed to board an Air India flight from Kochi airport after he reached the airport late. The Air India flight was scheduled to depart from Kochi International Airport at 11.40 pm. The governor reached the airport before the flight's departure and was told by the Air India crew that "doors have been shut and the aircraft had already pushed back," Press Trust of India reported.

లేటైనందుకు గవర్నర్ కే షాక్

Posted: 12/23/2015 03:51 PM IST
Pilot refuses to wait for the governor

విమానం ఎక్కేందుకు పది నిముషాల ముందు విమానాశ్రయానికి వచ్చిన కేరళ గవర్నర్  పి.. సదాశివం ను ఎయిర్ ఇండియా  పైలట్  విమానం ఎక్కనివ్వలేదు.  దీంతో కోచి- తిరువనంతపురం వెళ్లాల్సిన అయన  వెను దిరగాల్సివచ్చింది. కోచి ఎయిర్ పోర్ట్ నుంచి  10.40 గంటలకు  విమానం బయలుదేరాల్సి ఉంది.  పది నిముషాల ముందు గవర్నర్ విమానాశ్రయానికి చేరారు. తీరా విమానం ఎక్కుతుంటే.. పైలెట్  నో చెప్పాడు. విమానం బోర్డింగ్ టైమ్ అయి పోయిందని , మీరు ఎక్కడానికి వీలు లేదని ముఖమ్మీదే  పైలెట్  చెప్పినట్లు గవర్నర్ ఆఫీసువారు పేర్కొన్నారు. గవర్నర్ వెంట వచ్చిన అధికారులు  జోక్యం చేసుకుని నచ్చచెప్పబోయినా  పైలెట్ వినకలేదట.

దాంతో చేసేదేమీ లే్క గవర్నర్ రాత్రి  కోచిలోనే స్టేట్ గెస్ట్ హౌస్ లో గడపాల్సివచ్చింది. దీంతో గవర్నర్  కార్యాలయం అధికారులు  పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఎయిర్ ఇండియా పై ఫిర్యాదు చేశారు. ఎయిర్ ఇండియా 418 ఫ్లైట్  ఉదయం9.15కు బయలుదేరాల్సిన విమానం 10.45 వరకూ ఆలస్యం చేశారు. అయినా గవర్నర్  బయలుదేరడానికి 10 నిముషాల ముందువచ్చారు.  అయితే గవర్నర్ రావడానికి ముందే విమానం బయలుదేరిందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.  మహారాష్ట్ర సీఎం ఫద్నవీస్ కోసం  250 మంది ప్రయాణికుల విమానం ఆలస్యంగా బయలుదేరడంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Kerala  P Sathasivam  Air India flight  Governor Late  

Other Articles